భార్య పుట్టిన రోజు మరిచిపోతే భర్త జైలుకే.. అక్కడి వింత చట్టం గురించి మీకు తెలుసా..?

|

Jan 02, 2022 | 8:10 PM

Samoa Laws: ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. కొన్ని దేశాలలో వింతైనా చట్టాలు ఉంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు

భార్య పుట్టిన రోజు మరిచిపోతే భర్త జైలుకే.. అక్కడి వింత చట్టం గురించి మీకు తెలుసా..?
Samoa Laws
Follow us on

Samoa Laws: ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. కొన్ని దేశాలలో వింతైనా చట్టాలు ఉంటాయి. వాటి గురించి తెలిసినప్పుడు అందరు షాక్ అవుతారు. ఈ చట్టాలు పాతవే కావొచ్చు కానీ నేటికీ పాటిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఈ చట్టాలను మార్చలేదు. వీటి కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు మనం భార్య పుట్టినరోజును మరచిపోతే భర్త జైలుకు వెళ్లవలసిన దేశం గురించి తెలుసుకుందాం.

పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలోని సమోవా ద్వీపం అందానికి ప్రసిద్ధి చెందిన దేశం. వింతైన చట్టాలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చలో ఉంటుంది. సమోవా చట్టం చిన్న పొరపాటుకు భర్తలను జైలుకు పంపుతుంది. ఈ చట్టంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమోవా చట్టం ప్రకారం.. భర్త తన భార్య పుట్టినరోజును అనుకోకుండా మరచిపోతే అది పెద్ద నేరంగా భావిస్తారు. ఆ తర్వాత భార్య ఫిర్యాదు చేస్తే భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సమోవాలో భార్య పుట్టిన రోజును మర్చిపోయిన భర్తకు తొలిసారి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మళ్లీ అదే తప్పు జరిగితే జైలుకు వెళ్లాల్సిందే.

ఫిబ్రవరి 2020లో ప్రచురించబడిన వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. మహిళలకు సాధికారత కల్పించేందుకు దేశంలో ఈ చట్టాలను రూపొందించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అనేక గృహ హింస కేసులు తెరపైకి వచ్చాయి. వేరొక మహిళతో తన భర్త చేసిన చాటింగ్ చదివిన భార్య ఒంటికి నిప్పంటించుకుంది. అందుకే ఇక్కడ మహిళలకు అనేక చట్టాలు రూపొందించారు. అలాంటి చట్టాలలో ఇది కూడా ఒకటి.

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

Super Foods: చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి 10 సూపర్ ఫుడ్స్‌.. అవేంటంటే..?

పెన్షన్‌దారులు, బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఇప్పుడు ఈ పనులు చేయడానికి మార్చి వరకు అవకాశం..