Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు. వివాహ వేడుకలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేసిన సందడి, అల్లరి పనులు, డిఫరెంట్ ఎంట్రీ వంటి రకరకాల వీడియోలో నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఆ వీడియోలకు అంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లే అని చెప్పుకోవాలి. పెళ్లి.. నూరేళ్ల జీవితానికి నాంది. అందుకే.. ప్రతీ సీన్‌ను కెమెరాలో భద్రంగా పదిలపరిచుకునే ప్రయత్నం చేస్తుంటారు నవ వధువరులు. ఈ మేరకు ఫోటో, వీడియో గ్రాఫర్లను నియమించుకుంటారు. ఈ ఫోటో/వీడియో గ్రాఫర్ల వల్లే పెళ్లికి నయా లుక్ వస్తుందని చెప్పాలి. వారి డైరెక్షన్‌లో ఫోటోలకు ఫోజులు, స్టంట్‌లు అబ్బో చెప్పుకుంటూ పోవాలే గానీ చాలానే ఉంటాయి.
అయితే, ఇంతకాలం పెళ్లి, వరుడు, వధువు కు సంబంధించిన వీడియోలో వైరల్ అవగా.. ఇప్పుడు పెళ్లి ఘట్టాన్ని చిరకాలంగా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దే ఫోటో/వీడియో గ్రాఫర్ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అనడం కంటే.. రచ్చ రచ్చ చేస్తోందనడం కరెక్ట్. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్లి తంతులో భాగంగా వధువు, వరుడు అలా నడుచుకుంటూ వస్తున్నారు. వారిని ఫోటోలు తీసే పనిలో కెమెరామెన్ నిమగ్నమై ఉన్నాడు. అయితే, అతని వెనుక స్మిమ్మింగ్ పూల్ లాంటి కొలను ఉంది. అది గమనించని కెమెరామెన్.. వెనక్కి అలాగే నడుస్తూ వచ్చి ఒక్కసారిగా ఆ కొలనులోకి పడిపోయాడు. వెంటనే అలర్ట్ అయి పైకి వచ్చేశాడు. అదృష్టావశాత్తు ఆ కెమెరా నీటిలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. కాగా, కెమెరా మెన్ ఒక్కసారిగా కొలనులో పడిపోవడంతో.. పెళ్లి కూతురు సహా అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. కాగా, ఫోటోగ్రాఫర్ కొలనులో పడిపోవడానికి సంబంధించిన రెండు వీడియో క్లిప్‌లను అపెరినా స్టూడియోస్.. తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాపం అని కొందరు అంటుంటే.. వర్క్ డెడికేషన్ ఏం రేంజ్‌లో అతన్ని చూస్తే అర్థమవుతుందని కొందరు అంటున్నారు. మొత్తంగా నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Viral Video:
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..