Viral Wedding Card: నెట్టింట సందడి చేస్తున్న ‘వివాహ ఆహ్వాన పత్రిక’.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడూ చూసుండరు..

|

Sep 15, 2023 | 4:49 PM

కొందరు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ..ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని వారు మర్చిపోవడం బాధాకరం. ఆహ్వాన పత్రంలో జీతం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ సమాచారాన్ని పొందుపరచలేదని చమత్కరించారు. పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ను ప్రింట్ చేయడం మర్చిపోయినట్లు ఉన్నారని మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. మరొకరు

Viral Wedding Card: నెట్టింట సందడి చేస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక.. ఇలాంటి పెళ్లి కార్డు మీరెప్పుడూ చూసుండరు..
Marriage
Follow us on

నేటితరం అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ముందు ఫోటోషూట్ ఎంత క్రియేటివ్‌గా చేయాలి, పెళ్లి తర్వాత ఇల్లు ఏ రంగులో ఉండాలనేది కూడా ముందే డిసైడ్ చేస్తారు. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కూడా చాలా మంది క్రియేటివిటీని జోడిస్తున్నారు. వెడ్డింగ్‌ ఇన్విటేషన్ ఎలా ఉండాలి.. దాని డిజైన్ ఎలా ఉండాలి, ఏ రంగులో ప్రింట్ చేయాలి, ఎవరి పేరు ప్రింట్ చేయాలి..? అనేది కూడా పెద్ద సమస్యగా మారుతుంది. కొందరికి వివాహ ఆహ్వానపత్రికతోపాటు బహుమతులు పంపడం అలవాటు అయితే, మరికొందరు ఎకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ కార్డ్, బహుమతిని అందజేస్తున్నారు. సాధారణంగా వధూవరులు చదివిన డిగ్రీలకు సంబంధించి పెళ్లి పత్రికలో వారి పేరుతో పాటుగా రాస్తుంటారు. MBBS, LLB లాంటివి మ్యారేజ్ కార్డ్‌లో చూశాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక మ్యారేజ్ కార్డ్‌లో అబ్బాయి ఐఐటీ బాంబేలో చదివినట్లు ప్రింట్ చేయగా, పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఢిల్లీ ఐఐటీలో చదివినట్లు ప్రింట్ చేసింది. ప్రస్తుతం ఇలాంటి వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కార్డు ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆహ్వానపత్రికలో వధూవరులు ఏ విద్యాసంస్థలో చదువుకున్నారో కూడా ముద్రించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడి పేరు పక్కన ఐఐటీ బాంబే అని, వధువు పేరు పక్కన ఐఐటీ ఢిల్లీ అని ముద్రించారు. అంటే వరుడు ఐఐటీ బాంబేలో, వధువు ఢిల్లీ ఐఐటీలో చదివినట్లు రాసి ఉంది. ఆహ్వానం ఇలా ఉంది, “… మమతా మిశ్రా (IIT ఢిల్లీ)తో పీయూష్ బాజ్‌పాయ్ (IIT బాంబే) పవిత్ర వివాహ వేడుకకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.” అని రాసి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ ఇన్విటేషన్ కార్డ్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. పెళ్లికి కావాల్సింది కులం, మతం కాదు..ప్రేమ మాత్రమే అని రాశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిని 62,000 మందికి పైగా వీక్షించారు. దీనిపై కొందరు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ..ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని వారు మర్చిపోవడం బాధాకరం. ఆహ్వాన పత్రంలో జీతం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ సమాచారాన్ని పొందుపరచలేదని చమత్కరించారు. పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ను ప్రింట్ చేయడం మర్చిపోయినట్లు ఉన్నారని మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేశారు. మరొకరు ఇదంతా.. నాన్సెన్స్! తన జీపీఏ ఎందుకు చెప్పలేదు??” అని అడిగారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..