Viral Video: ఘనంగా పెళ్లి ఊరేగింపు.. నడిరోడ్డుమీద కత్తులతో మహిళలు విన్యాసాలు..

హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ పెళ్లి బరాత్‌ ఘనంగా నిర్వహించారు. అయితే తాము అందరికంటే భిన్నంగా అనుకున్నారేమో.. ఈ పెళ్ళివారు... బారాత్ కు వెళ్తూ..  తల్వార్లతో విన్యాసాలు చేశారు.

Viral Video: ఘనంగా పెళ్లి ఊరేగింపు.. నడిరోడ్డుమీద కత్తులతో మహిళలు విన్యాసాలు..
Wedding Video Viral

Updated on: May 13, 2022 | 9:14 PM

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్(Wedding Season) కొనసాగుతోంది. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి వేడుకలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సామాన్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ పెళ్లి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అయితే తాము అందరికంటే భిన్నంగా అనుకున్నారేమో.. ఈ పెళ్ళివారు… బారాత్ కు వెళ్తూ..  తల్వార్లతో విన్యాసాలు చేశారు. పురుషులే కాదు.. మహిళలు సైతం కత్తులు చేతపట్టి నడిరోడ్డుపై విన్యాసాలు చేశారు. ఈ తల్వార్‌ విన్యాసాల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరో పక్క ఇలాంటి విన్యాసాలు చలా ప్రమాదకరమని, నగరంలో ఇలాంటి విన్యాసాలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us