Video Viral: 12 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాడు.. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలియదు.. డ్రైవర్ ఆన్సర్ తెలిస్తే మైండ్ బ్లాక్

కారు నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్ (Seat Belt) పెట్టుకోవడం చాలా ముఖ్యం. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు....

Video Viral: 12 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాడు.. సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలియదు.. డ్రైవర్ ఆన్సర్ తెలిస్తే మైండ్ బ్లాక్
Seat Belt Video Viral

Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:25 PM

కారు నడుపుతున్న సమయంలో సీట్ బెల్ట్ (Seat Belt) పెట్టుకోవడం చాలా ముఖ్యం. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం లేదు. అవగాహన లేకపోవడం, అనుకూలంగా అనిపించకపోవడం, పోలీసులను చూసినప్పుడల్లా చలాన్‌కు భయపడి సీటు బెల్టు పెట్టుకోవడం సాధారణమైపోయింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారు ప్రస్తుతం ఎంతో మంది ఉన్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు నడుపుతున్నాడు. అతనికి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలియదు. హడావుడిగా మెడకు సీటు బెల్టు కట్టుకోవడాన్ని చూడవచ్చు. ఆ వ్యక్తి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని మెడకు సీటు బెల్టు చుట్టుకోవడాన్ని చూసి స్థానికులు అతడిని ఎన్నేళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నావ్ అని అడుగుతారు. దానికి సమాధానంగా 10-12 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నానని చెప్తాడు. తానెప్పుడూ సీటు బెల్టు పెట్టుకోలేదని అందుకే ఎలా పెట్టుకోవాలో తెలియదని చెప్పడం గమనార్హం. అంతే కాకుండా అతను ‘ఇప్పుడు ఏమి చేయాలి’ అని అడిగడం షాక్ కు గురి చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 45 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 76 వేలకు పైగా వ్యూస్, వందలాది మంది లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తెలిసిన వారికి, స్నేహితులకు ఫార్వార్డ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి డ్రైవ్ చేసే సమయంలో భద్రతా నియమాలు పాటించడం తప్పనిసరి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి