Viral Video: సోషల్‌మీడియా(Social Media)లో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీ (Funny videos) ఉంటే మరొకొన్ని కంటికి ఇంపుగా ఉంటాయి. ముఖ్యంగా డిఫరెంట్ టెస్టులతో తయారు చేసే ఆహారపదర్ధాల వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. అందుకనే రకరకాల రెసిపీ వీడియోలను నెటిజన్లు వాటిని పదేపదే చూస్తుంటారు. ఈ వీడియోకూడా అలాంటిదే. అందుకే నెటిజన్లు పదే పదే చూస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు వేర్వేరు కలర్ సూప్‌లతో చైనా చిహ్నం ఇన్ అండ్ యాంగ్‌ను రూపొందించాడు ఓ చెఫ్.
ఈ వీడియోను సీక్రేఫ్యాక్ట్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో ఒక చెఫ్ చేతిలో రెండు వేర్వేరు రంగుల సూప్‌లు ఉన్న జగ్గులు ఉన్నాయి. అతడు ఆ రెండు సూప్‌లను ఓ బౌల్‌లో నేర్పుగా పోస్తుంటాడు. అలా పోయగా..పోయగా.. చివరికి అది చైనా చిహ్నమైన ఇన్ అండ్ యాంగ్ రూపును సంతరించుకుంది. ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తూ చెఫ్ టాలెంట్‌కి ప్రశంసలు కురిపిస్తున్నారు. లైక్స్‌తో కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
India: భారత్‌లో ఏ రాష్ట్రంలోని వ్యవసాయోత్సాత్తులు ఏయే దేశాలకు ఎగుమతి అవుతున్నాయో మీకు తెలుసా..?