Viral: దేవత సామీ ఈ బాస్.. దండేసి దండం పెట్టాలి.. ఉద్యోగులకు బోనస్‌గా ఏం ఇచ్చిందో తెలిస్తే షాకే!
మీరు పని చేసే కంపెనీలో బోనస్‌గా ఎంతిస్తారు.? ఈ క్వశ్చన్‌కు అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా రూ. 1500.. మహా అయితే..
మీరు పని చేసే కంపెనీలో బోనస్‌గా ఎంతిస్తారు.? ఈ క్వశ్చన్‌కు అందరూ చెప్పే సమాధానం.. ఓ వెయ్యి, లేదా రూ. 1500.. మహా అయితే రూ. 2500 అని చెబుతారు. అయితే ఇక్కడొక బాస్.. బోనస్‌గా తన ఉద్యోగులకు ఏం ఇచ్చిందో తెలిస్తే మీరు స్టన్ అవ్వడం ఖాయం. ఆమె తన కంపెనీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. మిలియన్ డాలర్ల ఆదాయం దూసుకుపోతున్న సందర్భంగా.. తన ఉద్యోగులను సర్‌ప్రైజ్ చేస్తూ అదిరిపోయే బోనస్ ప్రకటించింది. ఇక ఆమె ఇచ్చింది తెలుసుకుని.. అందరూ ‘ప్రపంచంలో బెస్ట్ బాస్ నువ్వే తల్లి’, ‘దేవత సామీ ఈ బాస్’ అంటూ నెట్టింట కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని స్పాన్ ఎక్స్(Spanx) అనే కంపెనీ బాస్ సారా బ్లేక్లీ.. తన కంపెనీ 21వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు బోనస్ కింద 10,000 డాలర్లు(భారత కరెన్సీలో రూ. 8 లక్షలు), రెండు ఫస్ట్ క్లాస్ విమాన టికెట్లను ప్రకటించింది. ‘నేను మొదటిగా ఈ కంపెనీని స్థాపించాలనుకున్నప్పుడు ప్రతీ ఒక్కరూ నవ్వారు. అయినా నా మిషన్‌పై నమ్మకం ఉంచాను. ఎంతోమంది మహిళా వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకుని ఒక్కో అడుగుకు ముందుకేసి.. ఈ స్థాయికి చేరుకున్నాను. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసేందుకు నేను వరల్డ్ మొత్తం తిరుగుతున్నాను.. మీరు వెళ్లాలని మీకు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొన్నాను’ అని సారా చెప్పుకొచ్చింది.
”మీకు తెలుసా, మీరు ఓ ట్రిప్‌కు వెళ్ళాలన్నా.. మంచి డిన్నర్‌కి వెళ్ళాలన్నా.. మంచి హోటల్‌కి వెళ్లాలని అనుకున్నా దాని ఎంతగానో ఖర్చు అవుతుంది. అందుకే అందరికీ రెండు ఫస్ట్-క్లాస్ టిక్కెట్‌లతో పాటు 10 వేల డాలర్లు ఇస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రండి’ అంటూ సారా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. లేట్ ఎందుకు ఆ స్టోరీ ఏంటో మీరూ చూసేయండి.
View this post on Instagram