విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ మధ్యకాలంలో అనైతిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తాజాగా తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ చేస్తుండగా.. ఆమె చుట్టూ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ మువీ ‘బంటీ ఔర్ బబ్లీ’లో ఐశ్వర్యరాయ్ నటించిన ఐటెం సాగ్ ‘కజ్‌రారే..’ పాటకు ఓ టీచర్ తరగతి గదిలో విద్యార్ధుల ముందు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ విద్యార్ధి టీచరమ్మకు రెడ్ చున్నీ అందించడం, అమె దానిని వయ్యారంగా తిప్పుతూ మరింత హుషారుగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. ఇక తరగతి గదిలో ఉన్న విద్యార్ధులు ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటారు. తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై ‘హ్యాపీబర్త్ డే.. రష్మీ మేడాం!’ అని రాసి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. టీచర్ పుట్టిన రోజును విద్యార్థులు జరుపుతున్న సందర్భంగా ఆమె ఈ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఎక్స్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. మిలియన్లలో వ్యూస్, లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Never imagined we’d see a day where teachers are dancing literally on an item song inside a classroom. pic.twitter.com/4mKUl05RHY
— Jeetas posting their L”s (SWAGGY ERA) (@yeazlas) March 16, 2024
ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. విలువలకు ప్రాధాన్యమిచ్చే మన దేశంలో ఇలా తరగతి గదిలో ఐటమ్ సాంగ్‌కు టీచర్ డాన్స్ చేయడం సరికాదని మండిపడుతుంటే.. మరికొందరేమో.. డ్యాన్స్ అశ్లీలం కాదని, మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉండాలని మద్ధతు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు. సంప్రదాయాలకు విలువిచ్చే మన దేశంలో ఇలాంటి పని సరికాదని, ఇతర దేశాల్లో అక్కడి కల్చర్‌కి అవి సరిపోతాయని శుద్దులు చెబుతున్నారు. ఇతరులు సంతోషంగా ఉండటం కొంతమంది చూడలేరు. ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని పాత్రల్లో జీవించాలి. ఆమె టీచర్ అయినందున్న ఆమెకు డ్యాన్స్ చేసే అర్హత లేదా? అదేమీ అసభ్యకరంగా, రెచ్చకొట్టేలా లేదు. మన దేశంలో అమ్మాయిలు ఏం చేసినా జడ్జిమెంట్ చేస్తుంటారు అని మరొక యూజర్ ఘాటుగా స్పందించారు. ఇక ఈ వీడియోపై టీచర్ స్పందింస్తూ.. నేను క్లాస్‌లో పాఠాలు చెప్పేటప్పుడు స్ట్రిక్ట్ టీచర్‌ని. విద్యార్ధులకు పాఠాలతోపాటు అదనపు కార్యక్రమాలు కూడా బోధిస్తాం. స్కూల్ వార్షిక దినోత్సవం సందర్భంగా కల్చరర్ యాక్టివిటీస్‌లో భాగంగా ఈ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.