Kiss of Death: ‘ఎందీ బ్రో.. చావును ముద్దాడావ్‌! కోటి రూపాయలు ఇచ్చినా నేనైతే ఆ పని చేయను’

పాములు విషపూరితమైనవనే సంగతి తెలిసిందే. అందుకే  చాలా మంది పాము గురించి మాట్లాడినా భయంతో గజగజలాడిపోతారు. ఐతే మైక్ హోల్స్టన్ అనే వ్యక్తి మాత్రం వన్యప్రాణులతో సహవాసం చేస్తుంటాడు. వాటితో రకరకాల స్టంట్స్‌ చేసి.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. తాజాగా అతను ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకున్నాడు. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించరు. అలాంటి కింగ్ కోబ్రా తలపై..

Kiss of Death: ఎందీ బ్రో.. చావును ముద్దాడావ్‌! కోటి రూపాయలు ఇచ్చినా నేనైతే  ఆ పని చేయను
Kiss Of Death

Updated on: Aug 15, 2023 | 2:53 PM

పాము కనిపిస్తే మీరైతే ఏం చేస్తారు..? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతామనేగా మీ సమాధానం. మరి కొందరు మహా అయితే గుండె దడదడ లాడుతున్నా ధైర్యం చేసి కాస్త క్లోజ్‌గా వెళ్లి సెల్ఫీ తీసుకుని టా.. టా.. చెప్పేసి లగెత్తుతారు. కానీ వీడెవడోగానీ గుండెలు తీసిన బంటులా ఉన్నాడు. బారీ కింగ్‌ కోబ్రా తలపై ఏకంగా ముద్దెట్టాడు. నమ్మబుద్ధి కావడం లేదా..? ఐతే మీరీ వీడియో చూడాల్సిందే..

పాములు విషపూరితమైనవనే సంగతి తెలిసిందే. అందుకే  చాలా మంది పాము గురించి మాట్లాడినా భయంతో గజగజలాడిపోతారు. ఐతే మైక్ హోల్స్టన్ అనే వ్యక్తి మాత్రం వన్యప్రాణులతో సహవాసం చేస్తుంటాడు. వాటితో రకరకాల స్టంట్స్‌ చేసి.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. తాజాగా అతను ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము కింగ్ కోబ్రాను ముద్దుపెట్టుకున్నాడు. దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించరు. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. వీడియో కూడా తీశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం హడలెత్తిపోతున్నారు. లక్షల్లో వీక్షణలు, వేలల్లో లైకులు రావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు వావ్‌.. అంటుంటే..మరికొందరేమో సదరు వ్యక్తికి క్లాస్ పీకేస్తున్నారు. ‘క్షణకాల థ్రిల్లింగ్‌ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం అవసరమా.. ఇది ముమ్మాటికీ పిచ్చిపనే, కోట్ల రూపాయలు ఇచ్చినా నేను మాత్రం ఆ పని చేయను, కిస్ ఆఫ్ డెత్’ అని కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

నిజానికి ఈ విషపూరితమైన కింగ్ కోబ్రా పాము ఒక్క కాటుతో గజ ఏనుగును సైతం చంపేంత విషం కలిగి ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. వయసులో ఉన్న కింగ్ కోబ్రా 10 నుంచి 12 అడుగుల పొడవు, 9 కిలోల వరకు బరువు ఉంటుంది. తోకపై ఈ పాములు నిట్టనిలువుగా లేచి నిలబడగలవు. ఈ పాము ఒక్క చుక్క విషం 20 మందిని చంపేంత సామర్ధ్యం ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.