అడవి జంతువులను దగ్గరగా చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే, వాటిని ఓపెన్ ప్లేస్‌లో చూడాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే తేడా వస్తే ప్రాణాలు గాల్లో కవడం ఖాయం. ఈ క్యూరియాసిటీ కారణంగానే చాలా మంది జూ కి వెళ్తుంటారు. జంతువులను చూసేందుకు జంతు ప్రదర్శనల శాలకు వెళ్తుంటారు. అక్కడ జంతువులను ప్రత్యేకంగా బంధించి ఉంచుతారు. ఈ కారణంగా.. వాటిని దగ్గరగా చూసినట్లు ఉంటుంది. అలాగే సేఫ్‌గానూ ఉంటారు. కొందరు మాత్రం చాలా ధైర్యం చేస్తుంటారు. జంతువులను లైవ్‌లో చూసేందుకు ఆరాటపడుతారు. ఈ క్రమంలోనే కాస్త డబ్బు ఖర్చు చేసేనా సఫారీకి వెళ్తుంటారు. ఎందుకంటే.. అడవి జంతువులను చాలా దగ్గరగా చూడాలంటే.. జంగిల్ సఫారీని మించింది మరోటి లేదు. అయితే, సఫారీని ఆస్వాదిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా క్రూర మృగం, అదీ చిరుత మీ వాహనంలోకి దూకితే పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఓ టూరిస్ట్. అయితే, కొంచెం ధైర్యం చేసి.. ఆ చిరుత కదలికలను తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా భయంతో హడలిపోయారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ టూరిస్ట్ జంగిల్ సఫారీని ఆస్వాధిస్తున్నాడు. అటు పక్కనే కొన్ని చిరుత పులులు ఉన్నాయి. వాటిని చూస్తు ఆనందించాడు. కానీ, అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. క్షణ కాలంలోనే ఓ చిరుత టూరిస్టు ఉన్న కారులోకి దూరింది. అది చూసి అతను హడలిపోయారు. అయితే, తొలుత భయపడినా.. ఆ తరువాత ధైర్యం తెచ్చుకున్నాడు. కారులోకి వచ్చిన చిరుతను వీడియో తీశాడు. గమ్మున కదలకుండా కూర్చుని కెమెరా రికార్డ్ చేస్తూనే ఉన్నాడు. చిరుత అతని చుట్టూ తిరిగి.. చివరకు కారు లోపలి నుంచి బయటకు వెళ్లి బానెట్‌పైకి ఎక్కింది. దాంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు.
చిరుత కారులోపలికి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని మొహంలోని కనిపించిన లక్షణాలు ఈజీగా అతని భయాన్ని చూపిస్తున్నాయి. మొత్తానికి చిరుత దయాగుణం వల్ల అతను సేఫ్‌గా బయటపడ్డాడు. లేదంటే దానికి ఫలహారం అయ్యేవాడే. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ వీడియో చూసి షాక్ అవుతున్నారు. గుండెదడ పుట్టేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒక నిమిషం వ్యవధి ఉన్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 26 లక్షలకు పైగా వ్యూస్, 27 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
A man on safari in Tanzania starts recording without any movement what is happenning
— Tansu YEĞEN (@TansuYegen) December 11, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..