
కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. మనకు అదృష్టం ఉంటే కష్టపడకపోయినా పాస్ కావచ్చు. సముద్రం మధ్యలో ఉన్నా.. ఎలాగోలా ఒడ్డుకు ఈడుకుంటూ వచ్చేయచ్చు. అంతేకాదు.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా.. చిన్న గాయం కూడా తగలకుండా బయటపడొచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.? ఏం లేదండీ.! మీకు ఇప్పుడు చూపించబోయే వీడియో చూస్తే.. కచ్చితంగా యముడు లీవ్‌లో ఉన్నాడని అనుకుంటున్నారు.? అంతటి డేంజరస్ యాక్సిడెంట్ జరగబోయేది.. క్షణాల్లో తప్పించుకున్నారు. మరి అదేంటో చూసేద్దామా..
రోడ్లపై బైక్ మీద వెళ్లేటప్పుడు కచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఎక్కడ తేడా వచ్చినా.. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మనకు కొంచెం అదృష్టం ఉన్నా.. ఏదొక చిన్న గాయం అవ్వకమానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే తరహ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రయ్.. రయ్.. మంటూ బైక్‌పై దూసుకొచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు.. లారీ కింద పడినప్పటికీ.. ఎలాంటి దెబ్బ తగలకుండా ప్రాణాలతో బయటపడ్డారు. ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. వైరల్ వీడియో ప్రకారం.. మెయిన్ రోడ్డుపై ఒక పక్క లారీ, మరో పక్క కారు వెళ్తోంది. ఈ తరుణంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై రయ్.. రయ్.. మంటూ దూసుకొచ్చారు. కారును ఓవర్‌టేక్ చేద్దామని అనుకునేలోపు.. ఆ కారుకు బైక్ తగిలి అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో లారీ అటుగా వస్తోంది. లారీ చక్రాల కింద ఇద్దరూ పడాల్సింది.. క్షణాల్లో తప్పించుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని ఓ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.
Life doesn’t give everyone a second chance; hope they learn from their mistakes
Location – Ranchi- Patna highway
Shared by Dr. Shankar Mahto #driveresponsibly pic.twitter.com/561LfAF60I— Prateek Singh (@Prateek34381357) February 15, 2025
కాగా, ఈ వీడియోపై ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అలాగే దీనిపై నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపించారు. ‘యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో అని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘అదృష్టం అంటే ఇదేనని’ ఇంకొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి