Viral Video: ఇదేం లడ్డు సామీ.. గ్లాస్‌లో పోసుకుని తాగేస్తున్నారు? పిచ్చి పిక్స్‌.. వీడియో వైరల్

Internet Reacts To Besan Laddoo Soft Serve In Australia: ఓ రెస్టారెంట్‌లో లడ్డూ ఆకారం చూస్తే ఖచ్చితంగా నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఈ లడ్డూలను ఐస్‌ క్రీం మాదిరి గ్లాసుల్లో పోసి ఇస్తున్నారు మరీ.. ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో..

Viral Video: ఇదేం లడ్డు సామీ.. గ్లాస్‌లో పోసుకుని తాగేస్తున్నారు? పిచ్చి పిక్స్‌.. వీడియో వైరల్
Soft Besan Ladoo

Updated on: Nov 10, 2025 | 8:55 PM

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో రకరకాల వంటకాలతోపాటు సంప్రదాయ స్వీట్లు కూడా బోలెడన్ని ఉంటాయ్‌. ఇక పెళ్లిళ్లలో ఖచ్చితంగా లడ్డూ వడ్డిస్తారు. అయితే లడ్డూ ఏ ఆకారంలో ఉంటుందీ? ఇదీ కూడా ఓ ప్రశ్న.. ఆ మాత్రం తెలీదా? అని మూతి విరవకండీ.. అఫ్‌కోర్స్‌ లడ్డూ గుండ్రంగానే ఉంటుంది. తింటుంటే తియ్యగా.. అప్పుడప్పుడు గొంతుకూడా పట్టేస్తుంది. కానీ ఈ రెస్టారెంట్‌లో లడ్డూ ఆకారం చూస్తే ఖచ్చితంగా నోరెళ్ల బెడతారు. ఎందుకంటే ఈ లడ్డూలను ఐస్‌ క్రీం మాదిరి గ్లాసుల్లో పోసి ఇస్తున్నారు మరీ.. ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

లడ్డూ మనలో చాలా మందికి ఫేవరెట్ స్వీట్. అయితే ఆస్ట్రేలియాలోని ఓ వెజిటేరియల్ రెస్టారెంట్.. అక్కడి ఇండియన్ల కోసం లడ్డూ అందుబాటులో ఉంచింది. అయితే అందుకు ఓ వినూత్న ప్రయోగం చేసింది. శనగపిండితో లడ్డూని ఐస్‌క్రీమ్‌ మాదిరి తయారు చేసి గ్లాసుల్లో సాఫ్ట్‌సర్వ్ చేసేసింది. అక్కడికి వచ్చిన కస్టమర్లకు గ్లాసుల్లో లడ్డూ ఐస్‌ క్రీంను నింపి అందించడం ప్రారంభించింది సదరు రెస్టారెంట్‌. అయితే దీన్ని తిన్న కస్టమర్లు ఇదీ బాగానే ఉంది. టెస్ట్ అదిరిపోయిందంటూ తెగ పొగిడేస్తున్నారు. క్రీమీగా, రుచికరంగా ఉండే బేసన్ లడ్డూ సాఫ్ట్ సర్వ్‌ను మెషిన్ నుంచి అందరికీ అందిస్తున్నారు. అదనపు క్రంచ్ కోసం, ఈ ఐస్ క్రీం ఐకానిక్ లడ్డూను నట్స్‌, పిస్తాపప్పులతో అలంకరించారు.

ఇవి కూడా చదవండి

ఇక లడ్డుపై చేసిన ఈ వినూత్న ప్రయోగం చూసి భారతీయులు తెగ ఆశ్చర్యపోతున్నారు. రుచి అద్భుతంగా ఉందని పొగిడేస్తున్నారు. ఇకేం ఉంది భోజన ప్రియులు ఈ రెస్టారెంట్‌కు క్యూ కట్టేశారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కూడా ఈ రెస్టారెంట్‌లో ఐస్‌క్రీ లడ్డూ తిని.. ముంబైకి కూడా ఇలాంటి లడ్డూ కావాలంటూ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు పెట్టింది. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మీకూ నోరూరుతోందని కామెంట్లు పెడితే.. మరికొందరు మీకో దండం సామీ.. పాత విధానంలోనే లడ్డూ తింటాం అంటూ మూతి ముప్పై ఆరు వంకలు తిప్పారు. మీరూ ఈ లడ్డూ ఐస్‌ క్రీం వీడియో చూసేయండి..

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.