Viral Video: తోపుడు బండిపై స్ట్రీట్ ఫుడ్ అమ్ముతోన్న పీహెచ్‌డీ విద్యార్ధి.. వీడియో వైరల్

|

Sep 08, 2024 | 4:29 PM

నిరుద్యోగం దేశ వ్యాప్తంగా జడలు విప్పుకుని విలయతాండవం చేస్తుంది. సర్కార్‌ నిర్లక్ష్యం కారణంగా ఏ యేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ఎన్నో కలలతో డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న యువత చేసేందుకు సరైన ఉద్యోగం లేక చెడు అలవాట్ల బారీన పడుతున్నారు. మరికొందరు డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్ధి ఉద్యోగం దొరకలేదని చేతులు ముడుచుకుని కూర్చోకుండా చిన్నపనైనా పర్లేదు అదే మహదానందం అనే రీతిలో..

Viral Video: తోపుడు బండిపై స్ట్రీట్ ఫుడ్ అమ్ముతోన్న పీహెచ్‌డీ విద్యార్ధి.. వీడియో వైరల్
Chennai's Phd Food Vendor
Follow us on

చెన్నై, సెప్టెంబర్‌ 8: నిరుద్యోగం దేశ వ్యాప్తంగా జడలు విప్పుకుని విలయతాండవం చేస్తుంది. సర్కార్‌ నిర్లక్ష్యం కారణంగా ఏ యేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో ఎన్నో కలలతో డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్న యువత చేసేందుకు సరైన ఉద్యోగం లేక చెడు అలవాట్ల బారీన పడుతున్నారు. మరికొందరు డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్ధి ఉద్యోగం దొరకలేదని చేతులు ముడుచుకుని కూర్చోకుండా చిన్నపనైనా పర్లేదు అదే మహదానందం అనే రీతిలో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెద్ద చదువులు చదివి ఇంత చిన్న పనిచేస్తున్న సదరు యువకుడి గుండె ధైర్యాన్ని చూసి ఓ అమెరికా వ్లాగర్‌ ఆశ్చర్యంతో తలమునకలై పోయాడు. యువకుడి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. తెగ పొగిడేస్తున్నాడు. వివరాల్లోకెళ్తే..

అమెరికన్‌ వ్లాగర్‌ క్రిస్టోఫర్‌ లూయిస్‌ ఇటీవల తమిళనాడులోని చెన్నైలోని ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌కు వెళ్లాడు. అదీ గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఆ స్టాల్‌ దగ్గరికి వెళ్లాడు. చూస్తే.. అదొక చిన్న తోపుడు బండి. దానిపైనే ఓ యవకుడు చికెన్‌ 65 తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఇక లూయిస్‌ కూడా ఓ ప్లేట్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. యువకుడు అది తయారు చేసేలోపు అతడితో మాటలు కలిపాడు. అప్పుడే తెలిసింది.. ఈ వీధి వ్యాపారి ఓ పీహెచ్‌డీ విద్యార్ధి అని, బయోటెక్నాలజీలో డాక్టరేట్ చదువుతున్నాడని తెలుసుకుని తెగ ఆశ్చర్యపోయాడు. అంతేకాదు అతగాడి రీసెర్చ్‌ పేపర్స్‌ కూడా ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేయమని చెప్పి.. తన పేరు రేయాన్ అని తన వివరాలు చెప్పాడు. చూస్తే.. నిజంగానే గూగుల్‌లో అవి కనిపిస్తాయి. దీంతో లూయిస్‌ ఇంత పెద్ద చదువు చదువుతూ ఏ మాత్రం గర్వం లేకుండా చేతి ఖర్చుల కోసం చిన్న తోపుడు బండిలో వ్యాపారం చేస్తున్న రేయాన్‌ను చూసి అబ్బురపడిపోయాడు.

ఇవి కూడా చదవండి

వెంటనే పట్టరాని ఆనందంతో ఈ మొత్తం కాన్వర్‌జేషన్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. అంతేగాకుండా 100 డాలర్లు (రూ. 8000) రేయాన్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఉన్నత చదువుల కోసం రేయాన్‌ హార్డ్‌ వర్క్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.