ఇవేం బట్టల్రా సామీ..! ఉర్ఫీజావెద్‌ వెరైటీ డ్రెస్‌.. పచ్చిగడ్డితో ఫ్యాషన్‌ ప్రయోగం..

|

Apr 08, 2023 | 5:59 PM

ఉర్ఫీ ఇటీవల తన ట్విటర్‌లో క్షమాపణ కోరింది. తన దుస్తుల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తే క్షమించండి అంటూ ట్విట్‌ చేసింది. మీరు ఇక నుండి కొత్త దుస్తులలో మారిన ఉర్ఫీని చూస్తారు. అంటూ ఉర్ఫీ తన అధికారిక ట్విట్టర్‌లో రాశారు. 

ఇవేం బట్టల్రా సామీ..! ఉర్ఫీజావెద్‌ వెరైటీ డ్రెస్‌.. పచ్చిగడ్డితో ఫ్యాషన్‌ ప్రయోగం..
Urfi Javed
Follow us on

ఉర్ఫీ జావేద్ ఒక హిందీ టెలివిజన్ నటి. ఆమె వేసుకునే బట్టల కారణంగా తరచుగా ట్రోల్‌ అవుతుంటారు. బిగ్ బాస్ హిందీ వెర్షన్ ద్వారా ఫేమస్ అయిన ఉర్ఫీపై ‘ఓవర్ గ్లామర్’, ‘కాపీ క్యాట్’ అంటూ ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ, ఉర్ఫీ ఫ్యాషన్ ప్రయోగాల్లో మాత్రం ఎక్కడా తగ్గేదే అంటోంది. తాజాగా ఉర్ఫీ జావేద్ వేసుకున్న డ్రెస్‌ మరోమారు నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేసింది. ఒంటిపై పచ్చిగడ్డితో కప్పబడిన దుస్తుల్లో కనిపించింది ఉర్ఫీ. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేయబడుతున్నాయి.

బ్లూ కలర్‌ సూట్‌పై పచ్చి గడ్డితో కప్పేసిన డ్రెస్‌ ఇప్పుడు ఉర్ఫీ చేసిన కొత్త ప్రయోగం. చియా విత్తనాలను సూట్‌లో నానబెట్టారట. వాటిని 10 రోజులు నీటిలో నానబెట్టి పెంచడం ద్వారా విత్తనాలు మొలకెత్తాయని ఉర్ఫీ చెప్పారు. దాంతో ఇలాంటి అద్భుతమైన ఫలితం వస్తుందని ఊహించలేదని, ఇది చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పింది ఉర్ఫీ.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పచ్చిగడ్డితో తయారు చేసిన దుస్తులలో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. దాంతో చాలా మంది ఈ స్టార్‌ను ట్రోల్ చేయగా, మరికొందరు ఆమె వేసుకున్న కొత్త స్టైలిష్‌ డ్రెస్‌ని ఇష్టపడ్డారు. ఉర్ఫీ అది ఎలా తయారు చేశారో చెప్పమంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

ఇదిలా ఉంటే, ఉర్ఫీ ఇటీవల తన ట్విటర్‌లో క్షమాపణ కోరింది. తన దుస్తుల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతీస్తే క్షమించండి అంటూ ట్విట్‌ చేసింది. మీరు ఇక నుండి కొత్త దుస్తులలో మారిన ఉర్ఫీని చూస్తారు. అంటూ ఉర్ఫీ తన అధికారిక ట్విట్టర్‌లో రాశారు.

తాజాగా, ఉర్ఫీకి వ్యతిరేకంగా మరో నటుడు పెద్ద ప్రకటనతో ముందుకు వచ్చాడు. నటుడు ఫైజాన్ అన్సారీ ఉర్ఫీపై చాలా తీవ్రమైన ఆరోపణతో ముందుకు వచ్చారు. ఉర్ఫీ జావేద్ ట్రాన్స్‌జెండర్ అని ఫైజాన్ వెల్లడించాడు. ఉర్ఫీ ట్రాన్స్‌ఫర్ అని నిరూపించే పత్రాలు తన వద్ద ఉన్నాయని, వాటిని కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఫైజాన్ ముంబైలో తెలిపారు.