Watch: ఛీ ఛీ.. ఆరోగ్యాన్నిచ్చే కొబ్బరి బొండాలు ఇలా అమ్ముతున్నారా..? ఇలాంటి వాళ్లని ఏం చేద్దాం..

|

Jun 07, 2023 | 11:50 AM

వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ పలువురు నెటిజన్లు ఘాటుగా విమర్శించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

Watch: ఛీ ఛీ.. ఆరోగ్యాన్నిచ్చే కొబ్బరి బొండాలు ఇలా అమ్ముతున్నారా..? ఇలాంటి వాళ్లని ఏం చేద్దాం..
Drain Water On Coconut
Follow us on

వేసవితో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు, దాహార్తిని తీర్చుకునేందుకు ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా కొబ్బరి బొండాలను ఎక్కువగా తాగుతుంటారు. కేవలం వేసవిలో మాత్రమే కాదు ప్రతి కాలంలో కూడా కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వైద్యులు సైతం జ్వరం బారిన పడినా, నీరసం, వడదెబ్బ వంటి అనారోగ్య సమస్యలకు కొబ్బరి బొండాలు బాగా తాగించాలని సూచిస్తుంటారు. ఇంకా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే కొబ్బరి బొండాలను వేసవిలో ఎక్కువగా తాగడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు జనాలు.ఇక దాహం వేసిన సమయంలో కొబ్బరి బోండా ఇచ్చే ఉపశమనం మరేది ఇవ్వలేదు అనడంలోనూ సందేహం లేదు.

అయితే, కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్న ఒక వ్యక్తి చేసిన పని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్‌ వాటర్‌ చల్లుతున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ పలువురు నెటిజన్లు ఘాటుగా విమర్శించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..