పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ ఘటన అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వీడియో పఠాన్‌కోట్ జిల్లాలోని భోవాలో దుర్గామాత మండపం వద్ద జోగిందర్ పాల్ గ్రామం గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ముదురు గోధుమ రంగు చొక్కా ధరించిన యువకుడు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కానీ పాల్ పట్టించుకోలేదు. ఆ యువకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్ల ప్రయత్నం చేశారు. అయితే ఆ వ్యక్తి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. “మీరు నిజంగా ఏమి చేశారని?” అతడు ప్రశ్నించాడు.
జోగిందర్ పాల్ ఆ వ్యక్తిని ముందుకు రావాలని కోరారు. తర్వాత ఆ యువకుడికి మైక్ ఇచ్చి దాడి చేశాడు. ఈ దాడిలో నేతలు పాల్గొన్నారు. యువకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతడిని పట్టుకుని కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే ఆ వ్యక్తి తప్పించుకోగలిగాడు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా మాట్లాడుతూ: “ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాము.” అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్, ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూ మధ్య తీవ్రమైన వైరం కొనసాగుతుంది. ఈ ఘట కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది.
Joginder Pal, the @INCPunjab MLA from Bhoa assembly seat in Pathankot district, when asked by a young man about his performance in the last 4.5 years….this is how the MLA responded….@ndtv pic.twitter.com/p2AVSOtqjx
— Mohammad Ghazali (@ghazalimohammad) October 20, 2021
Read Also.. Viral Video: ఈ పెళ్లి కూతురు మామూలు స్పీడ్లో లేదు.. పెళ్లి మండపానికి ఎలా వెళ్లిందంటే.. వీడియో వైరల్..