
మాములుగా మనం ఉండే ఇంట్లోకి ఓ పాము వచ్చిందంటే అక్కడి నుంచి పరుగులు తీస్తాం. మరి ఏకంగా కొన్ని పాములు మన ఇంట్లోనే ఆవాసం ఏర్పాటు చేసుకుంటే..? ఇంట్లోనే కుప్పలు తెప్పులుగా పాములు మీ కంటపడితే ఏమైనా ఉంటుందా..? గుండెల్లో దడ మాములుగా ఉండదు కదూ. కానీ అలాంటి ఘటన వెలుగుచూసినట్లు నివేదికలు చెబుతున్నా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో పాముల పుట్ట భయానకంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా హర్డిదాలి గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. ఒక ఇంటి బేస్‌మెంట్ వద్ద పది కంటే ఎక్కువ పాములు తారసలాడుతూ కనిపించాయి. దీనిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానిక వార్తా సంస్థ భారత్ సమాచార్ ప్రకారం.. ఆ గూడు వంటి నిర్మాణంలో అనేక పాములు కనబడినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామస్తులు వెంటనే పోలీసులు, అటవీ శాఖకు సమాచారం అందించి, భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో ‘ఎక్స్’ ద్వారా ఆ వార్తా సంస్థ పోస్ట్ చేసిన వీడియోలో పాముల గూడు చీకట్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పాములు మెల్లిగా కదులుతూ, విడిపోకుండా గూడు చుట్టూ ఉండటం వీడియోలో చూడవచ్చు. అవి తడిగా ఆ బేస్‌మెంట్ వద్ద గుంపుగా కనిపించాయి.
వీడియో దిగువన చూడండి…
🚨 महराजगंज : घर में बने बेसमेंट में सांपों का बसेरा 🚨
🐍 दर्जनों सांपों को देखकर मचा हड़कंप
📞 ग्रामीणों ने वन विभाग को दी सूचना
📍 सोनौली थाना क्षेत्र के हरदीडाली का मामला#Maharajganj #SnakeNest #WildlifeAlert pic.twitter.com/D79E0QcuYa— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 19, 2025
ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనలు కొత్తగా ఏమి లేవు. గత నెలలో, దుద్వా టైగర్ రిజర్వ్ డివిజన్‌కు సుమారు 125 కిలోమీటర్ల దూరంలోని లఖీంపూర్-ఖేరీ జిల్లాలో అరుదైన పొడవైన ముక్కుతో కూడిన వైన స్నేక్ (లతా పాము) కనిపించింది.
మరో ఘటనలో, షాహజహాన్‌పూర్ జిల్లా బండా ప్రాంతంలో ఒక వ్యక్తి పామును తన మెడకు చుట్టుకోవడంతో దానివలన కాటుకు గురయ్యి మరణించాడు. మరొక సంఘటనలో, మీరట్ జిల్లా అక్బర్‌పూర్ సాదత్ గ్రామంలో ఒక వ్యక్తిని కోబ్రా పాము రాత్రంతా పది సార్లు కాటేసింది. అతని శరీరంపై చుట్టుకొని.. అతని మరణానంతరం కూడా పాము కాట్లు వేస్తూనే ఉంది. ఈ సంఘటనలు రాష్ట్రంలోని పాముల ఉనికి, వాటి కారణంగా కలిగే ప్రమాదాల తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..