Viral Video: దివ్యాంగుల ఇబ్బంది చూసిన ట్రాపిక్ పోలీసు ఏం చేశాడో తెలిస్తే.. మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు..

|

Sep 19, 2022 | 12:34 PM

దివ్యాంగులు రహదారిపై వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారు ట్రై సైకిల్స్ లో వెళ్తున్నా.. కొన్ని సార్లు ఎక్కువ ట్రాపిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ముంబై లాంట మహానగరాల్లో రహదారిపై ప్రయాణం అంటే ప్రత్యేకంగా..

Viral Video: దివ్యాంగుల ఇబ్బంది చూసిన ట్రాపిక్ పోలీసు ఏం చేశాడో తెలిస్తే.. మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు..
Mumbai Police
Follow us on

Viral News: దివ్యాంగులు రహదారిపై వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారు ట్రై సైకిల్స్ లో వెళ్తున్నా.. కొన్ని సార్లు ఎక్కువ ట్రాపిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ముంబై లాంట మహానగరాల్లో రహదారిపై ప్రయాణం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మామూలు మనుషులే ఆ ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఎన్నో అవస్థలు పడతారు. మరి దివ్యాంగులైతే మరింత సతమతమవుతారు. ఒక్కోసారి రోడ్లపై వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు వెళ్లేటప్పుడు వారు రోడ్డు దాటడానికి ట్రాఫిక్ విధుల్లో ఉండే పోలీసులు సహాయం చేస్తూ ఉంటారు. కాని ఇటీవల ముంబైలో కొంతమంది దివ్యాంగులు ఒక బృందంగా ఒకరి వెనుక ఒకరు క్యూగా వెళ్తున్నారు. అయితే అనుకోకుండా ట్రాఫిక్ వల్ల క్యూ విడిపోయింది. దీంతో ఒకరు ముందు మరొకరు వెనుక అయిపోయారు. ఇది గమనించిన కానిస్టేబుల్ మళ్లీ ఆ విభిన్న ప్రతిభావంతులు బృందంగా గుమిగూడటానికి తన వంతు సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొన్ని రోజుల క్రితం ముంబైలో దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈటోర్నమెంటులో విజయం సాధించిన తర్వాత క్రీడాకారులంతా ట్రై సైకిల్స్ లో ఒకరిని మరొకరు పట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. వీరందరిని ముందుగా ఒక ద్విచక్రవాహనంపై వెనుకాల కూర్చున్న వ్యక్తి లాగుతూ తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. అయితే రహదారిపై ట్రాఫిక్ కారణంగా వీరి లింకు తెగి.. ఎవరికి వారు విడిపోతారు. ఇది చూసిన కానిస్టేబుల్.. రహదారిపై వెళ్లే వాహనాలను ఆపి.. ఈ దివ్యాంగుల బృందాన్ని కలిపే ప్రయత్నం చేశారు. ఈపని చేసిన కానిస్టేబుల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈవీడియోను ముంబై పోలీసులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈపోస్టుతో పాటు దివ్యాంగులు రహదారిపై వెళ్లేటప్పుడు.. మిగతా వాహనదారులు నెమ్మెదిగా వెళ్లాలని సూచిస్తూ ఓ క్యాప్షన్ ను యాడ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..