Viral: మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్!
ఓ వ్యక్తి మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించి.. ఎక్స్‌రే తీయించారు.

ఓ వ్యక్తి మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో ఆస్పత్రికొచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించి.. ఎక్స్‌రే తీయించారు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ చూసిన వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎక్స్‌రే రిపోర్టులో సదరు వ్యక్తి మూత్రాశయంలో 10 సెంటీమీటర్ల మేకు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలు కథేంటంటే..
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాకు చెందిన జాగ్రామ్ అనే వ్యక్తి.. స్థానికంగా ఉన్న జిల్లా ఆస్పత్రికి.. మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో చికిత్స చేయించుకునేందుకు వెళ్లాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా.. 10 సెంటీమీటర్ల మేకు ఒకటి సదరు వ్యక్తి మూత్రాశయంలో ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సుమారు గంట పాటు శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు.. అతి కష్టం మీద ఆ మేకును బయటికి తీశారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇంతకీ అసలు ఆ మేకు ఎలా లోపలికి వెళ్లిందో ఆ వ్యక్తి తెలియదట. కాగా, ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం గమనార్హం.