Accident Video: నియంత్రణ కోల్పోయి రివర్స్ వచ్చిన ట్రక్కు.. వెనక స్కూటీపై వస్తోన్న మహిళ.. ఆ తర్వాత

యమడు లీవ్‌లో ఉన్నట్లున్నాడు. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. మహిళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ప్రమాదం తాలూకా దృశ్యాలు నెట్టింట వైరల్ అవున్నాయి. ఓ మెరక రోడ్డులో ప్రయాణిస్తున్న ట్రక్కు నియంత్రణ కోల్పోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

Accident Video: నియంత్రణ కోల్పోయి రివర్స్ వచ్చిన ట్రక్కు.. వెనక స్కూటీపై వస్తోన్న మహిళ.. ఆ తర్వాత
Accident

Updated on: May 17, 2025 | 8:52 PM

కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ సమీపంలో ఒక ట్రక్కు అదుపు తప్పి తన స్కూటర్‌ను వెనక్కి ఢీకొట్టడంతో ఒక కేరళ మహిళ ఘోర ప్రమాదానికి గురైంది. అయితే రెప్పపాటు వ్యవధిలో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటన మే 17 శనివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పెరింగళం పట్టణం,  మెడికల్ కాలేజీ మధ్యన ఉన్న CWRDM సమీపంలోని కొండపై జరిగింది. ఆ మహిళ ఓజ్హయాడికి ప్రాంతానికి చెందిన  అశ్వతిగా గుర్తించారు. ఆమె ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు వెనుక రెడ్ కలర్ స్కూటీపై ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ప్రమాదం భారిన పడింది. ఆ దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి.

వీడియోలో, ట్రక్కు ఒక ఎత్తైన మలుపు తిరుగున్న సమయంలో నియంత్రణ కోల్పోయి వెనుకకు వచ్చింది. ఆ సమయంలో అశ్వతి ట్రక్ వెనకే స్కూటిపై ఉంది. సెకన్ల వ్యవధిలో ట్రక్కు వచ్చి ఆమె స్కూటిని ఢీకొంది. ఆమె కింద పడటంతో ట్రక్కు పక్కనుంచి వెళ్లిపోయింది. వెంట్రక వాసిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన తర్వాత ట్రక్కు ఆగిపోయిందని తెలిసింది.

సమాచారం మేరకు మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు బ్రేకింగ్ వ్యవస్థలో యాంత్రిక వైఫల్యమే ప్రమాదానికి కారణమని డ్రైవర్ తెలిపాడు. 

ప్రమాద వీడియో చూడండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.