ఆపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లకు వరల్డ్ వైడ్‌గా యమ క్రేజ్ ఉంటుంది. అందులో ఉండే ఫీచర్లు, సెక్యురిటీ అలాంటివి మరి. కొత్త ఆపిల్ ఐ-ఫోన్లు ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినా ఐ-ఫోన్ ప్రియులు ఎగబడుతుంటారు. తాజాగా ముంబైలో ఐ-ఫోన్ 16 మోడల్ లాంఛ్ అయింది. ఇంకేముంది.. ఆ ఫోన్‌ల కోసం ఐ-ఫోన్ లవర్స్ అంతా క్యూ కట్టారు. ఎలాగైనా ఐ-ఫోన్ 16ను సాధించాల్సిందే అన్నట్లుగా గంటలపాటు క్యూ లైన్లో పడిగాపులు కాశారు. స్టోర్ తలుపులు తెరవగానే పరిగెత్తారు. దాంతో.. యాపిల్ స్టోర్ల దగ్గర భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు.. ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించింది. ఈ నేపథ్యంలోనే.. లాస్ట్ వర్షన్ ఐ-ఫోన్ 15 ఫోన్ల కంటే.. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గడంతో వాటి కోసం షాపుల ముందు బారులు తీరారు.
#WATCH | Long queues seen outside the Apple store in Delhi's Saket
Apple started its iPhone 16 series sale in India today. pic.twitter.com/hBboHFic9o
— ANI (@ANI) September 20, 2024
ఇక.. AI టెక్నాలజీ తరహాలో తయారైన ఫోన్ కావడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఏఐ టెక్నాలజీ మాదిరిగా సొంత ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు పరుగులు తీశారు. ముంబై, ఢిల్లీతోపాటు పలు నగరాల్లో ఆపిల్ స్టోర్ల ముందు వేల సంఖ్యలో క్యూ కట్టారు. ఇక.. ఐ-ఫోన్ 16 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను ఆపిల్ కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఐ-ఫోన్ 16, ఐ-ఫోన్ 16 ప్లస్, ఐ-ఫోన్ 16 ప్రో, ఐ-ఫోన్ 16 ప్రో మ్యాక్స్.. మోడల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ నాలుగు మోడల్స్‌లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్స్‌ను జత చేశారు. అలాగే.. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్-18తో వచ్చింది. ఈ ఫోన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లీష్ వర్సన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వచ్చే నెలలో అందించనుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..