Viral Video: ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి గురూ.. బీరు బాటిల్స్‌ను ఇలా కూడా ఉపయోగించవచ్చా..

ఇప్పటి వరకూ నేలను సిమెంట్, గ్రానైట్ వంటి వాటితో అలంకరించడం గురించి తెలుసు.. అయితే  మేస్త్రీలు గాజు సీసాలను అలంకరించి నేలను సిద్ధం చేస్తున్నారు. అయితే నేలమీద పరచిన సీసా పగిలి.. ఎవరికైనా గుచ్చుకుంటే..ఎంత బాధపడతారని కామెంట్ చేస్తున్నారు. 

Viral Video: ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి గురూ.. బీరు బాటిల్స్‌ను ఇలా కూడా ఉపయోగించవచ్చా..
Floor Made Of Glass Bottles

Updated on: May 11, 2022 | 5:58 PM

Viral Video: ప్రజలు తాము గాజు సీసాలను (Bottles) ఉపయోగించిన అనంతరం వాటిని చెత్తలో విసిరివేస్తారు. అయితే ఈ బాటిళ్లను ఉపయోగించి ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న వీడియోలో అందుకు భిన్నంగా ప్లోరింగ్ కి గాజు సీసాలను ఉపయోగిస్తున్నారు. వీడియోలో కొందరు మేస్త్రీలు గది ప్లోరింగ్ ను తయారు చేయడం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు ఫ్లోరింగ్ కోసం ఇటుకలను లేదా గ్రానైట్ వంటి రాయిలను ఉపయోగించలేదు. మేస్త్రీ..గాజు సీసాలను ఉపయోగించి.. ఫ్లోర్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన వారు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా బలమైన వస్తువులు నేలమీద పడితే.. అప్పుడు గాజు సీసా పగిలితే జరిగే గాయం గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే ఇలా ఎవరైనా నేలను అలంకరించడానికి గాజు సీసాలను ఉపయోగిస్తారా అంటూ షాక్ అవుతున్నారు.

మీరు ఇల్లు కట్టడం చూసి ఉంటే .. ఇంటి నిర్మాణం కోసం ఇటుక, ఇసుక, సిమెంట్ వంటి వాటిని ఉపయోగించడం చూసి ఉంటారు. అయితే ఇటుకలకు బదులు గాజు సీసాలతో ఇల్లు కట్టడం ఎప్పుడైనా చూశారా? ఈ ప్రశ్నకు మీ సమాధానం లేదు. అయితే  ప్రస్తుతం సోషల్ వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్ తింటారు. ఈ వీడియోలో, కొంతమంది కూలీలు రెండు గదుల కోసం ఫ్లోర్ ని రెడీ చేస్తున్నారు. అయితే ఫ్లోర్ తయారు చేయడానికి .. బీరు బాటిల్స్ ను ఒకదాని తర్వత ఒకటి లైన్ గా పేరుస్తూ.. ఫ్లోర్ ని రెడీ చేస్తున్నారు. అనంతరం గాజు సీసాల మీద ఇసుకను పోసి.. బీర్ బాటిల్స్ మధ్య గ్యాప్ లేకుండా నింపేశారు. తర్వాత గ్రౌండ్ సెట్ అయ్యాక దానిపై సిమెంట్ ను వేసి ప్లాస్టర్ చేశారు.  ఇటుకలను పేర్చి ఏవిధంగా సిమెంట్ తో అందంగా నేలను తయారు చేస్తారో అదే విధంగా.. బీరు బాటిల్స్ ను ఉపయోగించి అందమైన నేలను తయారు చేశారు. ఈ షాకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి..

ఇవి కూడా చదవండి

ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో techzexpress అనే పేజీలో షేర్ చేయబడింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..