ఇండోనేషియాలోని లెస్సర్ సుండా ద్వీపసమూహంలో వేలాది పాముల జాతులు కనిపిస్తాయి. చాలా చిన్న పాములు నుండి 25 అడుగుల పొడవైన పాములు తిరుగుతూ ఉంటాయి. నలుపు, పసుపు పాములు భారతదేశంలో విస్తారంగా కనిపిస్తాయి. కానీ ఇండోనేషియాలో,అన్ని రంగుల పాములు కనిపిస్తాయి. ఇటీవల, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నీలం, తెలుపు రంగులలో ఉన్న ఒక అందమైన, అరుదైన పాము కనిపించింది. ఇది తన అందంతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియోలో ఒక చిన్న నీలం రంగు పాము చాలా అందంగా కనిపిస్తుంది.. @AMAZlNGNATUREలో షేర్ చేయబడిన వీడియోను చూసిన ప్రజలు దాన్ని నమ్మలేకపోతున్నారు. అందుకే వీడియో చూసిన చాలా మంది దీనిని AI ద్వారా తయారు చేసిన వీడియోగా చెబుతున్నారు. మరికొందరు దాని రంగును ఐశ్వర్య రాయ్ కళ్ళతో పోల్చారు. ఇవన్నీ ఫన్నీ కామెంట్స్ అయినప్పటికీ. కొంతమంది పాము అమాయకత్వాన్ని కూడా గుర్తించారు.
This is Blue insularis pit viper and it is beautiful pic.twitter.com/4nUkmNjiB0
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) January 11, 2025
@AMAZlNGNATUREలో షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు నమ్మడం కష్టంగా ఉందంటున్నారు. ఇంత అందమైన పామును ఇంతకు ముందు చూడలేదు అంటూ చాలా మంది వ్యాఖ్యనించారు.