చుట్టూ సుందరమైన హిల్‌స్టేషన్‌.. అర్ధరాత్రి హోటల్‌లోకి ప్రవేశించిన నల్లటి ఆకారం..! ఆ షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..

ఒక హోటల్‌లోకి హఠాత్తుగా ఒక నల్లటి ఆకారం ప్రవేశించింది. తెల్లవారుజామున 2.55 గంటల ప్రాంతంలో హోటల్‌ మెయిన్‌ డోర్ తోసుకుని ఆ ఆకారం రిసెప్షన్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డైంది. ఆ తర్వాత ఎలుగుబంటి గది చుట్టూ వాసన చూస్తూ, పక్కన ఉన్న బెంచ్ ఎక్కి కిటికీపై ఉన్న వస్తువులను పరిశీలించడం కనిపిస్తుంది.

చుట్టూ సుందరమైన హిల్‌స్టేషన్‌.. అర్ధరాత్రి హోటల్‌లోకి ప్రవేశించిన నల్లటి ఆకారం..! ఆ షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..
Bear Enters Mount Abu Hotel

Updated on: Jul 24, 2025 | 11:32 AM

జనావాసాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది. పులులు, ఏనుగులతో పాటు ఎలుగుబంట్లు సైతం తరచూ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. తాజాగా, రాజస్థాన్​లోని సుందరమైన హిల్‌స్టేషన్‌ మౌంట్‌ అబూలో ఇటువంటి ఘటన జరిగింది. అడవిలోంచి దారి తప్పి వచ్చిన ఒక ఎలుగుబంటి ఒక హోటల్‌లోకి ప్రవేశించింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన భల్లూకం.. దాదాపు 4 నుంచి 5 నిమిషాల పాటు అక్కడే సంచరించింది. హోటల్‌ భల్లూకం చేసిన హంగామా అంతా ఆ హోటల్‌ గదిలోని సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

రాజస్థాన్‌లోని సుందరమైన హిల్ స్టేషన్ మౌంట్ అబూలోని ఒక హోటల్‌లోకి హఠాత్తుగా ఒక నల్లటి ఆకారం ప్రవేశించింది. తెల్లవారుజామున 2.55 గంటల ప్రాంతంలో హోటల్‌ మెయిన్‌ డోర్ తోసుకుని ఆ ఆకారం రిసెప్షన్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డైంది. ఆ తర్వాత ఎలుగుబంటి గది చుట్టూ వాసన చూస్తూ, పక్కన ఉన్న బెంచ్ ఎక్కి కిటికీపై ఉన్న వస్తువులను పరిశీలించడం కనిపిస్తుంది.

ఆ ఎలుగుబంటి దాదాపు నాలుగున్నర నిమిషాల పాటు గదిలో తిరుగుతూనే ఉంది. కానీ, ఆ ఎలుగుబంటికి కావాల్సింది ఏమీ కనిపించకపోవడంతో, అది లోపలికి వచ్చిన తలుపులోంచి బయటకు వెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో హోటల్ రిసెప్షన్ ఏరియాలో ఎవరూ లేరు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

దక్షిణ ఆరావళిలో రాజస్థాన్ ,గుజరాత్ మధ్య ఉన్న ఏకైక కొండ ప్రాంతం మౌంట్ అబు. ఈ ఏరియాలో ఎలుగు బంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో సుమారు 350 బద్ధకం ఎలుగుబంట్లు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మౌంట్ అబు వన్యప్రాణుల అభయారణ్యంలో కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ఎలుగుబంటి జాతి సాధారణంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. రాత్రిపూట ఆహారం కోసం ఎక్కువగా సంచరిస్తుంటాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..