Viral Video: విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారి.. పైలెట్ ఆమె నాన్నే అయితే.. వైరలైన వీడియో..

|

Oct 12, 2021 | 7:24 PM

చిన్నారులకు విమానం చూస్తే ఆనందం వేస్తుంది. ఇళ్ల పై నుంచి విమానం వెళ్లినప్పుడు పిల్లలు బయటకు వచ్చి ఫ్లైట్‎ను ఆశ్చర్యంగా చూస్తారు. నిజంగా వారు విమానంలో ప్రయాణిస్తే వారి సంతోషానికి అవధులు ఉండువు.. ఫ్లైట్ నడిపే పైలెట్ వాళ్ల నాన్నే అయితే...

Viral Video: విమానంలో ప్రయాణిస్తున్న చిన్నారి.. పైలెట్ ఆమె నాన్నే అయితే.. వైరలైన వీడియో..
Child
Follow us on

చిన్నారులకు విమానం చూస్తే ఆనందం వేస్తుంది. ఇళ్ల పై నుంచి విమానం వెళ్లినప్పుడు పిల్లలు బయటకు వచ్చి ఫ్లైట్‎ను ఆశ్చర్యంగా చూస్తారు. నిజంగా వారు విమానంలో ప్రయాణిస్తే వారి సంతోషానికి అవధులు ఉండువు.. ఫ్లైట్ నడిపే పైలెట్ వాళ్ల నాన్నే అయితే ఎలా ఉంటుంది..

ఇటీవల ఢిల్లీకి గోఎయిర్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక చిన్నారి స్వీట్ సర్‌ప్రైజ్ పొందింది. అప్పడు రియాక్షన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. షనాయ మోతిహార్ అనే అమ్మాయి తన తండ్రి పైలట్ అని తెలుసుకున్నప్పుడు తన తండ్రిని ఉత్సాహంగా పలకరిస్తోంది. కాక్‌పిట్ తలుపు వద్ద నిలబడి ఉన్న తన తండ్రికి “పప్ప” అని షనాయ పిలుస్తున్నట్లు వీడియోలో ఉంది. అప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వి ఆమె వైపు తిరిగాడు.

ఈ వీడియోను షనాయ తల్లి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో షేర్ చేశారు. ” ఐ లవ్ మై పప్ప.. నా మంచి స్నేహితుడు. నేను నాన్నతో ఉంటాను. మా అమ్మ చెప్పింది ఈ రోజు గాల్లో ఎరగబోతున్నామని.. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది”. అని క్యాప్షన్ రాశారు. ఈ వీడియోకు 1.4 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పాపా చిరునవ్వుపై నెటిజన్లు స్పందించారు. “ఇది చాలా గొప్ప విషయం.” ” పాప తండ్రికి జీవితంలో మార్చిపోలేని విమానం ప్రయాణం” అంటూ కామెంట్స్ చేశారు.

 

Read Also.. Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..