ఏమిటీ మహత్యం.. భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!

యుగాలు మారినా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ప్రపంచంలో అప్పుడప్పుడూ జరిగే కొన్ని సంఘటనలు ‘దేవుడు ఉన్నాడు’ అనే నమ్మకాన్ని బలపరుస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. భారీ క్రేన్లతో దాదాపు 48 గంటల పాటు శ్రమించినా.. ఓ ఆలయంలోని పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కదిలించలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన భక్తులు ఆ మారుతి మహిమేనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ మహత్యం.. భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
Ujjains Ancient Hanuman Idol News

Updated on: Sep 11, 2026 | 1:17 PM

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్.. 170 ఏళ్ల నాటి హనుమాన్ విగ్రహం.. 48 గంటలు, పెద్ద పెద్ద హైడ్రాలిక్ క్రెయిన్‌లు, పదుల సంఖ్యలో సిబ్బంది.. ఇలా ఎంత మంది ట్రై చేసినా ఒక్క ఆ విగ్రహాన్ని మాత్రం ఇంచు కూడా కదప లేకపోయారు. అవును.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవున్న ఓ వీడియోలో దీన్ని మనం చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది ఈ సంఘటన. అయితే ఉజ్జయినిలో త్వరలోనే జరగబోయే సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా కాంతన్- ఛత్రి మధ్య ఉన్న రహదారి విస్తరణ పనులు చేపట్టారు అధికారులు. అయితే ఈ మార్గంలో ఓ హనుమాన్ ఆలయం ఉండడంతో ఆ ఆలయాన్ని అక్కడి నుంచి మరో ప్లేస్‌కు షిప్ట్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో ఆలయ పైకప్పుడు, గోడలు అన్నింటికి తొలగించారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య స్టార్ట్ అయింది.

48 గంటల శ్రమ.. అయినా కదలని విగ్రహం

బయటి గోడలు అన్ని తొలగించాక.. ఆలయ గర్భగుడిలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు తొలుత సిబ్బంది విగ్రహం కింద తవ్వి కదిలించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో భారీ హైడ్రాలిక్ క్రేన్లను రంగంలోకి దించారు. పదుల సంఖ్యలో సిబ్బంది దాదాపు 48 గంటల పాటు తీవ్రంగా శ్రమించినా విగ్రహం ఇంచు కూడా కదలలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు తాత్కాలికంగా తొలగింపు పనులను నిలిపివేసి, స్వామివారి విగ్రహం చుట్టూ టెంట్ ఏర్పాటు చేశారు.

చరిత్రపై భిన్న వాదనలు

ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో పురావస్తు శాఖ (ASI) అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ హనుమాన్ విగ్రహం దాదాపు 170 ఏళ్ల నాటిదని.. విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షితంగా తరలించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఆలయంలోని విగ్రహం దాదాపు 8 అడుగుల ఎత్తున్న ఒకే రాతిపై చెక్కినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది భూమి లోపలికి బాగా పాతుకుపోయి ఉంది. ప్రస్తుతం ఒకటిన్నర అడుగుల లోతు వరకు తవ్వినా విగ్రహం పునాది లభించలేదు. దీంతో అది ఇంకా ఎంత లోతు వరకు ఉందో తెలుసుకునేందుకు ఏఎస్ఐ బృందం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది.

శాస్త్రీయ పరిశోధనలు – భక్తుల విశ్వాసం

భూమిలోకి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపి, ఉపరితలానికి తిరిగి వచ్చే సంకేతాల ద్వారా భూగర్భ మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా విగ్రహం భూమి అడుగున ఎంత లోతు వరకు విస్తరించి ఉందో, దాని పటిష్టత ఎలాంటిదో శాస్త్రీయంగా అంచనా వేయనున్నారు. ఒకవైపు అధికారులు శాస్త్రీయంగా కారణాలు వెతుకుతుంటే, భక్తులు మాత్రం ఇదంతా ఆ హనుమంతుడి మహిమేనని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us