పురాతన చర్చి గోడలో బయటపడ్డ అరుదైన మమ్మీ.. ఆ పక్కనే రాజు సమాధి..ఆ రహస్యం ఏంటంటే..

చారిత్రక ఆధారాలు దొరికినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలో కూడా ఇలాంటి ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఒక పురాతన చర్చి గోడలను కూల్చివేసినప్పుడు అందులో ఊహించనది కనిపించింది. పాత గోడలోపల ఒక పిల్లి మమ్మీ బయటపడింది. ఆ పక్కనే ఒక రాజు సమాధి కూడా ఉంది. ఆ పిల్లి.. రాజు ఆత్మను దుష్టశక్తుల నుండి కాపాడుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది..? పూర్తి వివరాలేంటో ఇక్కడ చూద్దాం...

పురాతన చర్చి గోడలో బయటపడ్డ అరుదైన మమ్మీ.. ఆ పక్కనే రాజు సమాధి..ఆ రహస్యం ఏంటంటే..
Waltham Abbey Church

Updated on: Oct 31, 2025 | 10:20 AM

బ్రిటన్‌లోని అత్యంత చారిత్రాత్మక చర్చిలలో ఒకటైన వాల్తామ్ అబ్బే చర్చి గోడలలో మమ్మీ చేయబడిన పిల్లిని గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. అది చూసిన చరిత్రకారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లాండ్ చివరి ఆంగ్లో-సాక్సన్ రాజు కింగ్ హెరాల్డ్ గాడ్విన్సన్ 1066లో హేస్టింగ్స్ యుద్ధంలో మరణించిన తర్వాత ఖననం చేయబడినట్లు భావిస్తున్న చర్చి ఇదే. ఈ వింత ఆవిష్కరణ చాలా గొప్పది.. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి గోడలలో పిల్లులను పాతిపెట్టే ఆచారం చర్చిలలో కాదు, ఇళ్లలో లేదా బార్న్‌లలో కనిపించింది.

పురాతన కాలంలో, మంత్రగత్తెలు, దయ్యాలు లేదా దుష్టశక్తుల నుండి రక్షించడానికి పిల్లులకు ఇలా గోడలు కట్టేవారని నిపుణులు అంటున్నారు. ఈ గార్డియన్ పిల్లులు దుష్టశక్తులను తరిమికొడతాయని నమ్ముతారు. కానీ చర్చి వంటి మతపరమైన ప్రదేశంలో అలాంటి ఆచారం చాలా అరుదు. ఇది పరిశోధకులకు ఈ ఆవిష్కరణను మరింత షాకింగ్‌గా, ఆసక్తికరంగా మార్చింది.

మ్యూజియంలో జరిగిన ఆడిట్ సమయంలో ఈ పిల్లి కనిపించింది . మ్యూజియం మేనేజర్ ఇయాన్ చానెల్ మాట్లాడుతూ, నేను ఒక పాత పెట్టెను తెరిచి లోపల మమ్మీ చేయబడిన పిల్లి కనిపించిందని చెప్పాడు. అది చూసినప్పుడు తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పారు.. ఇది 1970లలో వాల్తామ్ అబ్బే హిస్టారికల్ సొసైటీ నుండి స్వీకరించబడిన మ్యూజియం తొలి దశలో భాగం అని చెప్పారు. వాల్తామ్ అబ్బే చర్చి గోడల లోపల పిల్లి కనిపించిందని పత్రాలు సూచిస్తున్నాయి. ఈ వస్తువు నిజంగా భయంకరమైనది. ఎవరైనా చర్చి గోడలలో పిల్లిని ఎందుకు పాతిపెడతారో ఆలోచించడం వింతగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..