ప్రస్తుతం ఈ కాలంలో స్వీయరక్షణ అనేది ఎంతో ముఖ్యమైపోయింది. ఎప్పుడు, ఎవరు, ఎలా మనపై దాడి చేస్తారో తేలియదు. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అనుకోని సంఘటల నుంచి తప్పించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైన అకస్మాత్తుగా దాడి చేసిన మనకు తెలిసిన మార్షలు ఆర్ట్స్ తో వారిని వెనక్కి పంపించేయచ్చు. అచ్చం అలాంటి ఘటనే ఓ రెస్టారెంట్లో చోటుచేసుకుంది. అయితే రెస్టారెంట్లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారి టేబుల్ దగ్గర వేయిటర్ గా పనిచేసే అమ్మాయి ఏవో జరుపుతోంది.
అకస్మాత్తుగా వాళ్లిదరిలో ఓ వ్యక్తి లేచి ఆమె చేయిని బలవంతంగా పట్టుకున్నాడు. ఆమె అతని చేయిని వెనక్కి కదిలించింది. మళ్లీ అతను ఆమె చేయి పట్టుకోవడంతో వెంటనే అతని మోహంపై దెబ్బలు వేసింది. ఆ తర్వాత కాలుతో తన్నింది. రెండో వ్యక్తి కూడా ఆమెను కొట్టేందుకు రావడంతో అతడ్ని కూడా కాలితో తన్నింది. సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ ఆడ బ్రూస్ లీ అని పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటీజన్లు భిన్నమైన రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
Female Bruce Lee ?? pic.twitter.com/Fg3Ben0IpQ
— CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..