Viral Video: భలే ఐడియా గురూ.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ.. టెస్ట్‌ అదుర్స్‌ అంటున్న నెటిజన్లు..

|

Dec 01, 2021 | 10:01 PM

Coffee In Cooker: దైనందన జీవితంలో చాలామంది ఒక కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. అలసటగా ఉన్నా.. తలనొప్పి అనిపించినా..? కాఫీ తాగి రిలాక్స్ అవుతారు. ప్రపంచంలోని చాలామంది

Viral Video: భలే ఐడియా గురూ.. కుక్కర్ ప్రెజర్‌తో క్షణాల్లోనే వేడి వేడి కాఫీ.. టెస్ట్‌ అదుర్స్‌ అంటున్న నెటిజన్లు..
Coffee In Cooker
Follow us on

Coffee In Cooker: దైనందన జీవితంలో చాలామంది ఒక కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. అలసటగా ఉన్నా.. తలనొప్పి అనిపించినా..? కాఫీ తాగి రిలాక్స్ అవుతారు. ప్రపంచంలోని చాలామంది కాఫీతోనే ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే చాలామంది కాఫీని తాగుతుంటారు. అయితే.. సాధారణంగా కాఫీ తయారు చేసే విధానం గురించి మనందరికీ తెలుసు. ముందు పాలను వేడి చేసి.. దానిలో కొంచెం చక్కెర వేసి.. ఆ తర్వాత కాఫీ పొడిని వేస్తారు. ఈ విధంగా తయారు చేయడాన్ని మనం చాలాసార్లు చూసుంటాము. కానీ మీకు ఈ న్యూస్ కొంచెం వింతగా అనిపించవచ్చు. ఇది చూసి.. కాఫీ ఇలా కూడా తయారు చేస్తారా..? అంటూ గ్వాలియర్‌కు చెందినవ్యక్తిని చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగించి కాఫీ తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఇటీవల, ఒక వీధి వ్యాపారి వేడి వేడి కాఫీని తయారు చేయడం కనిపించింది. అతను కాఫీ తయారు చేయడాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @eatthisagra యూజర్‌ అప్‌లోడ్ చేశారు. ఒక కాఫీ తయారీదారుడు.. తన సైకిల్‌పై రుచికరమైన కాఫీని విక్రయిస్తున్నట్లు చూడవచ్చు. అతని కాఫీ చేయడానికి, అతను మొదట పాలు, కాఫీపొడి, చక్కెరను ఒక జగ్గులో వేస్తాడు. ఆ తర్వాత దానిని వేడి చేయడానికి కుక్కర్‌కు జోడించబడిన ప్రెజర్ కంట్రోల్డ్ పైపును పాలమిశ్రమంలో ముంచుతాడు. ఆ తర్వాత లాక్‌ తిప్పగానే కాఫీ నురుగులు పొంగుకుంటూ వేడివేడిగా తయారవుతుంది. వేడి అయిన తర్వాత చివరగా ఆ మిశ్రమంపై కొంచెం కాఫీ చల్లి కస్టమర్లకు ఇస్తున్నాడు. అయితే.. కాఫీ విక్రేత గ్వాలియర్‌కు చెందినవ్యక్తి అని పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో..

అయితే.. వీడియోను అప్‌లోడ్ చేసినప్పటి నుంచి దాదాపు రెండు మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. దాదాపు 30 వేల మంది లైక్‌ చేశారు. దీంతోపాటు ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యక్తి నైపుణ్యానికి అందరూ సెల్యూట్‌ చేస్తున్నారు. అతని ప్రత్యేకమైన కాఫీని చూస్తుంటే.. తాగాలనిపిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: