Taj Mahal: ఏం మనుషులు రా బాబు.. తాజ్ మహాల్ ముందే అసభ్యకరంగా.. ప్రేమ చిహ్నానికే మచ్చ తెచ్చేలా

|

Sep 15, 2024 | 4:50 PM

ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని భారత పురావస్తు శాఖ తెలిపింది. ఈ మేరకు ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ.. ఈ విషయమై తాజ్ మహల్ ఇన్‌చార్జ్‌ని వివరణ కోరుతున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గార్డెన్‌లలో నిఘా పెంచాలని భద్రతా సిబ్బందిని కోరామని చెప్పారు.

Taj Mahal: ఏం మనుషులు రా బాబు.. తాజ్ మహాల్ ముందే అసభ్యకరంగా.. ప్రేమ చిహ్నానికే మచ్చ తెచ్చేలా
Visitors Caught Urinating In Taj Mahal Garden
Follow us on

ప్రపంచంలోనే ఏడు అద్భుతాల్లో ఒకటైన ఐకానిక్ తాజ్ మహల్‌ వద్ద ఇటీవల ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. దాని ప్రతిష్టను దెబ్బతీసేలా ఇద్దరు పర్యాటకులు చేసిన పాడుపని సర్వత్రా ఆగ్రహం తెప్పించింది. స్మారక చిహ్నం తాజ్‌మహల్‌ లోపల విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇద్దరు సందర్శకులు తాజ్ మహల్ గార్డెన్‌ బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నప్పటికీ ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజ్‌మహల్ గార్డెన్‌లో ఇద్దరు పర్యాటకులు మూత్ర విసర్జన చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. గార్డెన్స్‌లో సెక్యూరిటీ సిబ్బంది సంఖ్యను పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తెలిపింది. ఈ మేరకు ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ ఆర్కే పటేల్ మాట్లాడుతూ.. ఈ విషయమై తాజ్ మహల్ ఇన్‌చార్జ్‌ని వివరణ కోరుతున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గార్డెన్‌లలో నిఘా పెంచాలని భద్రతా సిబ్బందిని కోరామని చెప్పారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో ఇటీవల కుండపోత వర్షాలు కుమ్మరించాయి. ఆగ్రాలో వర్షపాతం కారణంగా తాజ్ మహల్‌తో సహా పలు చారిత్రక కట్టడాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. తాజ్ మహల్ మెయిన్ డోమ్ వద్ద వర్షపు నీరు లీక్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఘటనతో చర్యలు చేపట్టారమని.. డ్రోన్ కెమెరా సాయంతో మెయిన్ డోమ్ పూర్తిగా తనిఖీలు నిర్వహించినట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లీకేజీ కారణంగా ప్రధాన గోపురానికి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. భారీ వరదలతో తాజ్ మహల్ గార్డెన్ మొత్తం వరద నీటిలో మునిగిపోయిందని తెలిసింది. దీంతో తాజ్ మహల్ రక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..