
ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ వినియోగదారులలో ఎక్కువ మంది ప్రజాదరణ పొందుతోంది. ఈ వైరల్ వీడియో ఒక పెళ్లికి సంబంధించినది. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు భోజనాల వద్దకు చేరుకున్నారు. అందరూ ఎవరికి వారుగా తమ ప్లేట్లలో ఆహారాన్ని వడ్డించుకుంటున్నారు. అంతలోనే ఒక మహిళ తన ప్లేట్‌ను గులాబ్ జామున్‌లతో నింపుకోవటం కనిపిస్తుంది. ఇంతలో, ఒక కెమెరామెన్ వెనుక నుండి ఆమెను ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు.
ఆ మహిళ తన ప్లేట్ నిండా గులాబ్ జామున్ తీసుకొని వెళ్ళిపోతుండగా, కెమెరామెన్ ఆమెను ఫోటో తీయబోయాడు.. దానికి ఆమె సిగ్గుపడుతూ, వెంటనే గులాబ్ జామున్లన్నింటినీ వెనక్కి పెట్టి ప్లేట్‌లో ఒక ముక్క మాత్రమే తీసుకుంటుంది. ఆమె చుట్టూ ఉన్నవారు ఆమె చేసిన పనికి తెగ నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోను @neeridresi అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది. గులాబ్ జామున్ ది క్వీన్ ఆఫ్ వెడ్డింగ్ డెజర్ట్స్. అని రాశారు. మా భాభి ఈ హాట్ అండ్ జ్యుసి ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. ఒకేసారి 10 వడ్డించుకున్నారు. కానీ, కెమెరామెన్ రాంగ్ ఎంట్రీతో పాపం ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ, ఆ తరువాత ఏం జరిగిందో చూడండి.
వీడియో ఇక్కడ చూడండి..
👑 गुलाब जामुन: द क्वीन ऑफ वेडिंग डेसर्ट। भीड़ में, हमारी भाभी जी भी इस गरमा-गरम और रसीले डिलाइट का मज़ा
लेने से खुद को रोक नहीं पाईं! और एक
साथ 10 उठा लिया लेकिन कैमरा वाले ने
की गलत एंट्री फिर क्या हुआ आप देखें 🤣🤣👇 pic.twitter.com/Htugf6EcwS— Neer (@neeridresi) November 11, 2025
ఈ వీడియో చూసిన తర్వాత వినియోగదారులు అనేక రకాల కామెంట్స్ చేశారు. దీనిలో ఒకరు ఇలా అన్నారు..గులాబ్ జామున్ నిజంగా ప్రతి పెళ్లికి గర్వకారణం, వేడిగా, తేనెలాగా తీపిగా ఉంటుంది. అందుకే మీ బాబీ 10గులాబ్‌జామూన్‌లను ఒకేసారి తినాలనుకున్నారు. కానీ, కెమెరామెన్ ఎంట్రీ ఆ దృశ్యాన్ని వైరల్ చేశారు అంటూ వ్యాఖ్యానించారు..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..