VIRAL VIDEO : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన కారు దొంగ..! రైలు పట్టాలపై కారు నడుపుతూ గందరగోళం..

|

Jul 19, 2021 | 6:12 PM

VIRAL VIDEO : యూకేలోని లండన్‌లో ఓ కారుదొంగ స్థానిక పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించాడు. ఏకంగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి రైలు పట్టాలపై కారు నడుపుతూ

VIRAL VIDEO : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించిన కారు దొంగ..! రైలు పట్టాలపై కారు నడుపుతూ గందరగోళం..
Viral Video
Follow us on

VIRAL VIDEO : యూకేలోని లండన్‌లో ఓ కారుదొంగ స్థానిక పోలీసులను ముప్పుతిప్పలు పెట్టించాడు. ఏకంగా రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి రైలు పట్టాలపై కారు నడుపుతూ ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేశాడు. కొద్ది సేపటివరకు ఎవరికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది పరిస్థితి. యూకేలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ దొంగ రేంజ్ రోవర్ కారును దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందుకున్న హెర్ట్‌ఫోర్డ్‌షీర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీని అడ్డుకునే ప్రయత్నంలో దొంగతో తలపడతారు. అయితే ఆ దొంగ వారినుంచి తప్పించుకుని కారుతో స్పీడ్‌గా వెళ్లిపోతాడు. హాలీవుడ్ రేంజ్‌లో కారును వెంబడించడంతో దొంగ ఏం చేయాలో తెలియక కారును రైల్వేస్టేషన్ లోకి పోనిస్తాడు. అంతేకాదు అక్కడి నుంచి రైలు పట్టాల మీదుగా కారు డ్రైవ్ చేస్తూ వెళుతుంటాడు.

దీనిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. కొద్దిసేపటికి ఆ కారు వెనుక పోలీసులు పరుగెత్తడం చూసి అప్పుడు సీన్ అందరికి అర్థమవుతుంది. అయితే దొంగ కారును ఎత్తుకెళ్లడం ఏమోగానీ పోలీసులకు మాత్రం చుక్కలు చూపించాడు. అయితే కారు ట్రాక్ మీదకు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కారును ట్రాక్ మీద నుంచి తొలగించిన తర్వాతే రైలు సేవలను పునరుద్ధరించారు. ఆ దొంగ రైల్వే ట్రాక్ మీద దూసుకెళ్తున్న వీడియోను ఇప్పటివరకు సుమారు 2.8 మిలియన్ మందికి పైగా వీక్షించారు. ఈ ఘరానాదొంగ చేసిన పనిని చూస్తే అందరు నోరెళ్ల బెడుతున్నారు.

Viral Photos : అందమైన జాబిల్లి చిత్రాలు..! ఇంతవరకు మీరెప్పుడు చూసి ఉండరు.. ఒక్కసారి తిలకించండి..

Hyundai Micro SUV: అతి చిన్న ఎస్‌యూవీ తీసుకువస్తున్న హ్యుందాయ్..దీని ప్రత్యేకతలు ఇవే!

Bakrid Festival: బక్రీద్ కి ముందు ఆంక్షల సడలింపు..కేరళ ప్రభుత్వ వివరణ కోరిన సుప్రీంకోర్టు ..