Viral Video: ఈ యువతి టాలెంట్ వెరీ వెరీ స్పెషల్.. చెప్పులు, చీపురతో వాల్ పెయింట్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

|

Dec 30, 2023 | 12:53 PM

ఒక మహిళ గోడను కాన్వాస్‌గా చేసి అక్కడ పెయింటింగ్ చేయడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీనికోసం మహిళ ఎలాంటి పెయింట్ బ్రష్‌ను ఉపయోగించలేదు. అలా కాకుండా తన కళాత్మకతను చూపించడానికి రోలింగ్ పిన్ నుండి చెప్పుల వరకు అన్నిటినీ ఉపయోగించింది. తన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ రకమైన కళ కూడా ఉందని చాలా మంది నమ్మలేకపోతున్నామని కామెంట్ చేశారు

Viral Video: ఈ యువతి టాలెంట్ వెరీ వెరీ స్పెషల్.. చెప్పులు, చీపురతో వాల్ పెయింట్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
Viral Video
Follow us on

కళాకారుడి మనసు చాలా సున్నితమైంది. అదే సమయంలో తన ఊహలకు ప్రతి రూపాన్ని కల్పిస్తూ ఒక అర్ధవంతమైన ఆకృతిని ఇస్తారు. ప్రకృతిలో అందాలను ఆవిష్కరిస్తారు. ఇలాంటి కళాకారుడి ఆలోచనల నుంచి సముద్రం నుంచి ముత్యాలను బయటకు తీస్తాడు. ఇలాంటి ఆకృతిల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు చాలా కళాఖండాలను ఉదాహరణలుగా చూశాం. ప్రస్తుతం అటువంటి కళాకారుడి కళ ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఒక అమ్మాయి తన ఇంటిలో ఉన్న వస్తువులను ఉపయోగించి అటువంటి కళాకృతిని సృష్టించింది. దీన్ని చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.

ఒక మహిళ గోడను కాన్వాస్‌గా చేసి అక్కడ పెయింటింగ్ చేయడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీనికోసం మహిళ ఎలాంటి పెయింట్ బ్రష్‌ను ఉపయోగించలేదు. అలా కాకుండా తన కళాత్మకతను చూపించడానికి రోలింగ్ పిన్ నుండి చెప్పుల వరకు అన్నిటినీ ఉపయోగించింది. చివరకు సింహం ముఖాన్ని పెయింట్ చేసింది. అలెక్స్ తన కళకు సైకిల్ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

తన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ రకమైన కళ కూడా ఉందని చాలా మంది నమ్మలేకపోతున్నామని కామెంట్ చేశారు. ఈ ఆర్టిస్ట్ పేరు అలెక్స్. తన సారూప్య కళాత్మకతతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆర్టిస్ట్. ఆర్ట్‌వర్క్ రీల్ ప్రపంచంలోనే కాదు వాస్తవ ప్రపంచంలో కూడా చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ గా ఖ్యాతిగాంచారు. ప్రస్తుతం చర్చనీయాంశమైన పెయింటింగ్. అందుకోసం అలెక్స్ ఇంట్లోని వస్తువులను ఉపయోగించాడు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఒక కళాకారుడు ఇలా కళను ప్రదర్శించగలరని తాను నమ్మలేకపోతున్నాను’ అని రాశారు. ‘మీలో ఏదైనా ప్రతిభ ఉంటే ఎవరినైనా మెప్పించవచ్చు’ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు  చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై రకరకాల కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..