Viral Video: ఓర్ని.. మరీ ఇలా తయారయ్యరేంట్రా.. చివరకు అక్కడ కూడా మొదలెట్టారా?
యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రీల్స్ రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకొని, హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారిలో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ఇలానే ఓ జంట రైల్వే ట్రాక్‌పై రీల్ చేసి చిక్కుల్లో పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువతలో రీల్స్ పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రీల్స్ రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకొని, హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారిలో మాత్రం మార్పు రావట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ఏకంగా మెట్రో రైల్వే ట్రాక్‌పైకి ఎక్కింది. అక్కడ రీల్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అది చూసిన జనాలు ఆ జంట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ జంట రైల్వే బ్రిడ్జ్‌పై ఎక్కి రీల్స్ చేశారు. వాళ్లు రీల్ చేస్తున్న సమయంలో ఒక ట్రైన్ వేగంగా దూసుకొచ్చింది. పక్కనే ఉన్న చిన్న వంతెనపై నడుస్తున్న ఆ జంట ట్రైన్ నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. అక్కడ కొంచెం తేడా జరిగినా ఆ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కానీ ఆ జంట మాత్రం అవేవి పట్టించుకోకుండా ఆ ప్లేస్ ప్రమాదకరమని తెలిసినా అక్కడికి వెళ్లి రీల్ చేశారు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు వాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదురు జంటపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులకు ట్యాగ్ చేశారు. అయితే ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందించిందా, ఏవైనా చర్యలు తీసుకుందా అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
వీడియో చూడండి..
🚨 For a few seconds of social media fame, people are now risking their lives. Dancing on active Railway Bridges with trains speeding right behind them.
One Slip, One gust of Wind… and it’s Over. 🤦♂️ pic.twitter.com/uyifgZBw6Q
— Gems (@gemsofbabus_) October 10, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
