Viral Video: ఒంటెతో సెల్ఫీ.. ఎంత డేంజరో తెలుసుకున్న యువతి.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

|

Mar 27, 2022 | 5:55 AM

Viral Video: ఈ రోజుల్లో సెల్ఫీలంటే అందరకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు దిగే వ్యవహారంలో చాలా

Viral Video: ఒంటెతో సెల్ఫీ.. ఎంత డేంజరో తెలుసుకున్న యువతి.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Women Selfie
Follow us on

Viral Video: ఈ రోజుల్లో సెల్ఫీలంటే అందరకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేకాదు సెల్ఫీలు దిగే వ్యవహారంలో చాలా సార్లు పెద్ద పెద్ద సంఘటనలు కూడా జరిగాయి. సెల్ఫీలు తీసుకునే క్రమంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని రకాల సెల్ఫీలు సోషల్‌ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు. నెటిజన్లు ఈ వీడియోని తెగా ఎంజాయ్‌ చేస్తు్న్నారు. అంతేకాదు రకరకాల కామెంట్లు కూడా చేస్తు్న్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసా..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ ఒంటెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం మనం వీడియోలో చూడవచ్చు. సరైన క్రమంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఒంటె అకస్మాత్తుగా తమాష పనిచేస్తుంది. ఒక్కసారిగా ఆమె జుట్టుని నోటితో గట్టిగా పీకడం మనం వీడియోలో గమనించవచ్చు. దీంతో సదరు యువతి పెద్దగా కేకలు వేస్తుంది. ఒంటె ఆమె జుట్టుని నోటితో తీసుకొని నమలడం మనం చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు.

ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ అంగుసామి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమాయానికి ఈ వీడియోని నాలుగు వేల మందికి పైగా చూశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్స్‌, షేర్లతో స్పందిస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు. కొంతమంది ఆ యువతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఈ వీడియోను తమాషాగా అభివర్ణిస్తున్నారు. మీరు కూడా మీ కామెంట్‌ని తెలియజేయండి.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

సరికొత్త ప్రేమ కథా చిత్రమ్‌.. 67 ఏళ్ల మహిళ.. 28 ఏళ్ల అబ్బాయి..!