Viral Video: రైల్లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు… బాబోయ్‌.. మరీ ఇలానా?

ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం సిగపట్లు అనేది సాధారణ అంశమే. సీటు కోసం లేడీస్‌ కొట్టుకున్న సందర్బాలు అనేకం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళలు గొడవ పడుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో...

Viral Video: రైల్లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు... బాబోయ్‌.. మరీ ఇలానా?
Women Fighting In Mumbai Lo

Updated on: Jul 03, 2025 | 8:55 PM

ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం సిగపట్లు అనేది సాధారణ అంశమే. సీటు కోసం లేడీస్‌ కొట్టుకున్న సందర్బాలు అనేకం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళలు గొడవ పడుతున్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎస్‌టీ-కళ్యాణ్ లోకల్ ట్రైన్‌లో డోంబివిలి సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులతో కిక్కిరిసిన రైలులో మహిళా ప్రయాణికులు ఒకరినొకరు చితక్కొట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వీడియోలో ఒక మహిళ మరొక మహిళ జుట్టును గట్టిగా పట్టుకుని దాడి చేస్తుంది. మిగిలిన మహిళలు వారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఘటనను చూసిన కొంతమంది రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకుంటారు. రైలు కుర్లా చేరుకోగానే పరిస్థితిని పరిష్కరించడానికి కుర్లా RPF సిబ్బంది అక్కడికి చేరుకుంటారు. కానీ అప్పటికే గొడవ పడిన మహిళలు రైలు నుంచి దిగి వెళ్లిపోయారు.

వీడియో చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటివి కూడా ఓ భాగం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదేమైనా లోకల్ ట్రైన్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇలాంటి పరిస్థితులు మారాలంటే రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

వీడియో చూడండి: