
సోషల్ మీడియాలో చాలాసార్లు మనం ఇలాంటి వీడియోలను చూస్తుంటాం.. వీటిని నమ్మడం కష్టం. ఎందుకంటే ఏ తల్లి అయినా సరే ఉద్దేశపూర్వకంగా తన బిడ్డను పైకప్పు నుంచి కిందకు.. లేదా మరొకరి ఒడిలోకి విసిరేస్తుందా..! చేయదు అయితే ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అందులో ఒక స్త్రీ పైకప్పు నుంచి ఒక పురుషుడి ఒడిలోకి పిల్లవాడిని విసిరేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు తాము చూసినది నిజమేనా అని ఆలోచించవలసి వస్తుంది.
చాలా మంది మహిళలు పైకప్పుపై నిలబడి ఉన్నారు.. చాలా మంది పురుషులు కింద నిలబడి ఉన్నారు. మొదట మహిళలు రోడ్డుపై జరుగుతున్న ఊరేగింపును చూడటానికి నిలబడి ఉన్నట్లు అనిపించింది. అయితే కొన్ని సెకన్లలో విషయం వింతగా మారుతుంది. ఒక మహిళ చేతిలో పిల్లవాడిని పట్టుకుని పైకప్పు అంచున ప్రమాదకరంగా వాలుతూ కనిపించింది..మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె ఆ చిన్న పిల్లవాడిని పైకప్పు నుంచి కిందకు విసిరేసింది. కింద నిలబడి ఉన్న వ్యక్తి ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. అయితే ఆ పిల్లవాడిని కింద నిలబడిన వ్యక్తి పొరపాటున పట్టుకోలేక పోయినా.. అతని చేతి నుంచి జారిపడి ఉంటే ఏమి జరిగి ఉండేదో ఊహించడానికి కూడా మనసు రాదు.
వీడియోను ఇక్కడ చూడండి
ఈ వీడియో ఎక్కడిది అనే విషయం గురించి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో rjkhurki అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో, వినియోగదారులు రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇది అస్సలు ఫన్నీ కాదు, ఇది భయంకరంగా ముగిసే ఆట అని అంటారు. దేవుడు ఆ బిడ్డను దీవించుగాక’ అని రాసాడు, మరొకరు బ్లింకిట్ కూడా ఇలాంటి బాల్కనీ డెలివరీని చూసి సిగ్గుపడుతుంది’ అని రాసాడు. అదేవిధంగా ‘ఇది చాలా బాధ్యతారహితంగా ఉంది. ఎవరైనా ఒక పిల్లవాడిని ఇలా ఎలా చేయగలరు?’ అని రాసాడు, మరొకరు ‘కొంతమంది పిల్లలు ఎంత సున్నితంగా ఉంటారు’ అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..