AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video Effect: సరదాగా వీడియో తీసుకుంది.. ఆపై క్షమించండి మహాప్రభో అని వేడుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Viral Video Effect: ఆలయ ప్రాంగణంలో అల్లరి చేష్టలు చేసిన ఓ యువతికి భక్తులు చుక్కలు చూపించారు. వారు ఇచ్చిన షాక్‌కు.. క్షమించండి మహాప్రభో తప్పు చేశానంటూ లిఖిత పూర్వకంగా వేడుకుంది.

Viral Video Effect: సరదాగా వీడియో తీసుకుంది.. ఆపై క్షమించండి మహాప్రభో అని వేడుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Temple
Shiva Prajapati
|

Updated on: Oct 11, 2021 | 11:56 AM

Share

Viral Video Effect: ఆలయ ప్రాంగణంలో అల్లరి చేష్టలు చేసిన ఓ యువతికి భక్తులు చుక్కలు చూపించారు. వారు ఇచ్చిన షాక్‌కు.. క్షమించండి మహాప్రభో తప్పు చేశానంటూ లిఖిత పూర్వకంగా వేడుకుంది. ఇంతకీ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండోర్‌కు చెందిన ఓ యువతి.. మహాకాలేశ్వర్ ఆలయ ప్రాంగాణంలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయంలో రీల్స్(వీడియో) తీసింది. బాలీవుడ్ పాటపై తన వీడియోను షూట్ చేసింది. ఆపై దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అది కాస్తా ఆలయ అధికారుల కంట పడటంతో.. వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవస్థానం ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసే విధంగా ప్రవర్శించిన ఆ అమ్మాయిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇదే విషయాన్ని దేవస్థానం సహాయ కార్యదర్శి మూల్‌చంద్ జున్వాల్ తెలిపారు. ఇండోర్‌కు చెందిన మనీషా రోషన్‌.. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా, సాంప్రదాయాన్ని కించపరుస్తూ ఆలయంలో వీడియో చిత్రీకరించిందని పేర్కొన్నారు. దీనిపై మహాకాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని జున్వాల్ తెలిపారు.

అయితే, ఆ యువతి తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోరుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. హిందూ ధార్మిక సంస్థలు ఆమె తీరును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎంతో ప్రశస్థి కలిగిన శివాలయంలో పిచ్చి పనులు చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ముప్పేటా దాడితో సతమతమైన యువతి.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా క్షమాపణలు తెలిపింది. ‘‘నేను ఉజ్జయిని దేవాలయంలో బాలీవుడ్ పాటకు ఒక వీడియో చిత్రీకరించాను. ఆ వీడియోపై హిందూ సంఘాలు, భక్తులు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదు. నేను చేసిన ఈ వీడియో వల్ల ఎవరికైనా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు చేయబోను.’’ అని సదరు యువతి తన వీడియోలో పేర్కొంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోను తొలగించింది. ఆ తరువాత తాను చేసిన చర్యకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెబుతూ.. లేఖ రాసింది. ఆ లేఖను మహాకాల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అందించింది.

కాగా, గత నెలలో.. ఛతర్‌పూర్ నగరంలోని ఒక ఆలయం వెలుపల బాలీవుడ్ పాటలపై డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ యువతిపై ఛతర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత యువతి తన చర్యకు పాశ్చాత్యాపం వ్యక్తం చేసి.. క్షమాపణలు చెప్పింది.

Also read:SunFlower Seeds: పొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంతో తీసుకుంటే ఫలితాలు ఎక్కువే.. ఎలాగో తెలుసుకోండి..

Bizarre: ఏపీలో విచిత్ర ఘటన.. గజాననుడి ఆకారంలో జన్మించిన శునకం.. పూజలు చేస్తున్న జనం.. వీడియో..

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.53వేల ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌కు బదులు రెండు నిర్మ సబ్బులు.. వీడియో వైరల్‌