Viral News: ఓ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది. ఇది వినడానికి కొంత విచిత్రంగా ఉండొచ్చు.. కాని వాస్తవం. చేతికి ఆస్మార్ట్ వాచ్ (SMART WATCH) లేకపోతే.. ఆమహిళ పరిస్థితి ఏమయ్యేదో పాపం. ఒక్కోసారి మనకు అనుకోకుండా జరిగే ప్రమాదాలనుంచి మనల్ని.. మనతో ఉండే వస్తువులే రక్షిస్తాయని మనం ఊహించను కూడా ఊహించం. మనతో పాటు ఎవరూ లేని సమయాల్లో ఏదైనా ప్రమాదం వాటిల్లితే మనల్ని మనం రక్షించుకోవల్సిన పరిస్థితి లేకపోతే.. మన పరిస్థితి ఏమిటి అంటే సమాధానం ఉండదు. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అనుకోకుండా ఓ ప్రమాదం వాటిల్లడంతో ఆమహిళను తన చేతికున్న స్మార్ట్ వాచ్ రక్షించింది. ఇది ఎలాగో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. చాలా మంది ఫిజికల్ ఫిట్ నెస్ కోసం జిమ్(GYM) కు వెళ్తారు. కొంతమంది తమ ఇంట్లోనే చిన్న జిమ్ ఏర్పాటుచేసుకుని కసరత్తులు చేస్తుంటారు. జిమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆసమయంలో మనల్ని రక్షించేవారు ఎవరూ ఉండరు. జిమ్ చేసేటప్పుడు తెలియని ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు పట్టేయడం, బ్యాలెన్స్ తప్పడంలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఓ షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఓహయోకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై కసరత్తు చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు అనుకోని ప్రమాదం ఏర్పడింది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక చాలాసేపు ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు(POLICE) వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘This is so embarrassing’ — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help ? pic.twitter.com/8nod8P6oQl
— NowThis (@nowthisnews) September 5, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..