
ఈ రోజుల్లో ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక హృదయాన్ని ఆకట్టుకునే ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఒక భార్య తన భర్త కొత్త బైక్ కోరికను తీర్చింది. భర్త కొనుక్కోవాలని కలలు కన్న బైక్‌ను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. తమ ఇంటి ముందుకు వచ్చిన కొత్త బైక్ తనదే అని తెలిసిన సమయంలో ఆ వ్యక్తి స్పందన చూడదగినది. ఈ వీడియో భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తోంది.
ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటి బయట నిలబడి ఉన్నట్లు చూపించగా.. ఒక వ్యక్తి కొత్త బుల్లెట్‌తో ఇంటి ముందుకు వచ్చి నిలిచాడు. మొదట అక్కడ ఉన్నవారికి ఏమీ అర్థం కాలేదు. అయితే అక్కడ ఉన్న తన భార్యను చూడగానే.. ఆ కొత్త బైక్ తనకోసమే అని.. తనకు ఇష్టమైన బైక్ అని గ్రహించాడు. తరువాత భార్య తన భర్తకు బైక్ కీని చేతిలో పెట్టి ఆశ్చర్యపరిచింది. అలా తనకు చేతితో కీ పెట్టడానికి ఆ భర్త
భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు.. అతని కళ్ళ నుంచి కన్నీరు వచ్చింది. తర్వాత అతను ఏడుస్తూనే తన భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు.
ఈ వీడియోలో అత్యంత అందమైన భాగం భర్త స్పందన.. కొత్త బైక్ తనదని తెలుసుకున్నప్పుడు. అతని ముఖంలో చిరునవ్వు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. నెటిజన్లు ఈ జంటపై తమ ప్రేమను రకరకాల కామెంట్స్ రూపంతో తెలియజేస్తున్నారు. @vinayshaarma ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఇప్పటివరకు 9 లక్షల 41 వేల మందికి పైగా ఇష్టపడ్డారు.
వీడియోను ఇక్కడ చూడండి
ఒక యూజర్ ఇలా వ్యాఖ్యానించారు “మిలియనీర్లు కూడా ఈ రకమైన ప్రేమను పొందలేరు. మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఈ ఆనందం సొంతం అని మరొకరు, “భాయ్ ని చూసిన తర్వాత నాకు కూడా ఏడవాలని అనిపించింది” అని అన్నారు. మరొక యూజర్, “పురుషులకు కూడా భావాలు ఉంటాయి” అని అన్నారు. వారు కూడా ప్రేమ, గౌరవానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..