AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ముఖంపై మొటిమ వచ్చిందని కంగారుపడ్డ మహిళ.. ఆపై కొద్దిసేపటికే సీన్ సితార్

ముఖంపై మొటిమలు వచ్చాయని వాటిని తొలగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారా.? అయితే ఇది మీకోసమే. న్యూయార్క్‌లోని ఒక మహిళకు ముఖంపై మొటిమ రావడంతో ఆమె దానిని తొలగించడానికి ప్రయత్నించింది. ఇక అది కాస్తా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Viral: ముఖంపై మొటిమ వచ్చిందని కంగారుపడ్డ మహిళ.. ఆపై కొద్దిసేపటికే సీన్ సితార్
Viral News
Ravi Kiran
|

Updated on: Aug 14, 2025 | 1:11 PM

Share

ముఖంపై మొటిమలు వచ్చాయని వాటిని తొలగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారా.? అయితే ఇది మీకోసమే. న్యూయార్క్‌లోని ఒక మహిళకు ముఖంపై మొటిమ రావడంతో ఆమె దానిని తొలగించడానికి ప్రయత్నించింది. ఇక అది కాస్తా.. ప్రాణాంతక వ్యాధికి దారి తీసింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెడికేషన్ ఇవ్వడంతో పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు.

లిష్ మేరీ అనే టిక్‌టాక్ యూజర్‌కు ముఖం ఎడమవైపున చిన్న మొటిమ వచ్చింది. ఇక దాన్ని కాస్తా ఆమె తొలగించేందుకు ప్రయత్నించగా.. కొన్ని గంటల్లోనే ఆమె ముఖం యొక్క ఎడమ వైపు నాటకీయంగా ఉబ్బిపోయింది. తీవ్రమైన నొప్పితో నవ్వేటప్పుడు ఇబ్బందిపడింది. ఈ విషయాన్ని ఆమె వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

వైద్యులు ఆమెకు తీవ్రమైన ముఖ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు నిర్ధారించారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల కలయికలో మెడికేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి నోటి వరకు విస్తరించి ఉందని.. చర్మవ్యాధి నిపుణులు తెలిపారు. ఆమెకు మొటిమ ఏర్పడిన ప్రాంతంలో కావెర్నస్ సైనస్ ద్వారా మెదడుకు నేరుగా అనుసంధానించే సిరలు ఉంటాయి. దీని వల్ల ఆ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరుగుతాయన్నారు.

‘ఈ ప్రాంతంలో మీకు మొటిమలు వచ్చాయంటే, మీరు మెదడుపై ప్రభావం చూపించే గాయాన్ని సృష్టించినట్టే. ఇది బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి మెదడుపై ప్రభావం చూపించేలా చేస్తుంది’ అని NYC-ఆధారిత చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ మార్క్ స్ట్రోమ్ పేర్కొన్నారు. అలా ఏర్పడటం వల్ల అంధత్వం, స్ట్రోక్, పక్షవాతం లాంటి లక్షణాలు వస్తాయని.. అరుదైన సందర్భాల్లో మరణం కూడా సంభవించవచ్చు అని అన్నారు.

తనకు వచ్చే రిస్క్‌లు గురించి ముందుగానే అవగాహన ఉందని.. అందుకే కొద్ది గంటల్లోనే వైద్య సాయాన్ని కోరానని మేరీ చెప్పుకొచ్చింది. ‘నాకు చాలా త్వరగా నొప్పి తీవ్రతరం అయింది. అందుకే మెడికల్ సిబ్బంది సాయం తీసుకున్నా. నెక్స్ట్ డేకి పరిస్థితి మెరుగుపడింది. అయినప్పటికీ నవ్వుతుండగా పెయిన్ వచ్చేది. మూడు రోజుల తర్వాత 100 శాతం సాధారణ స్థితికి చేరుకున్నట్లు’ ఆమె తెలిపింది. ఇలా ముఖంపై సెన్సిటివ్ ఏరియాల్లో మొటిమలు వచ్చినప్పుడు.. వాటిని తొలగించడానికి ప్రయత్నించకండి అని చర్మవ్యాధి నిపుణులు తెలిపారు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..