Viral Video: వార్నీ ఇదేందయ్యా.. బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపై పరిగెడుతోంది..

తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అలాంటి ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి తన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని టాలెంట్‌ చూసిన ప్రజలు ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం క్రియేటివిటీ బ్రో అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

Viral Video: వార్నీ ఇదేందయ్యా.. బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపై పరిగెడుతోంది..
Man Created Bed As A Car

Updated on: Apr 04, 2025 | 1:55 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజూ వైరల్ అవుతుంటాయి. అయితే, అందులో కొన్ని వీడియోలు మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. మరికొందరిని ఆశ్చర్యపడేలా చేస్తాయి. తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అలాంటి ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి తన కళా నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని టాలెంట్‌ చూసిన ప్రజలు ఔరా అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం క్రియేటివిటీ బ్రో అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

వీడియో ఇక్కడ చూడండి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చాలా విభిన్నంగా ఆలోచించి తనకు నచ్చిన రీతిలో ఓ కారును తయారు చేసుకున్నాడు. ఇంట్లోని బెడ్‌ను అతని పాత కారుకు అమర్చాడు. ముఖ్యంగా తాను రోజూ పడుకునే మంచాన్నే కారుగా మార్చుకున్నాడు. తల పెట్టే వైపు డ్రైవింగ్ సీట్ ఏర్పాటు చేయగా.. కాళ్ల వైపు రెండు అద్దాలను పెట్టాడు. అంతేకాదు రోడ్డుపై దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..