AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏదో ప్రళయం వచ్చే ముందే ఈ చేపలు కనిపిస్తాయట.. తీరానికి కొట్టుకొచ్చిన డూమ్స్​ డే ఫిష్‌

ఈ వారంలో రెండు వేర్వేరు అత్యంత అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. "డూమ్స్ డే ఫిష్" అని పిలుచుకునే డీప్-సీ ఓర్ ఫిష్ తీరానికి కొట్టుకు వచ్చాయి. ఒకటి మన దేశంలోని తమిళనాడు తీరంలో మత్స్యకారులకు చిక్కితే మరొకటి ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకు వచ్చింది. మహా సముద్ర గర్భంలో నివసించే ఈ చేపలు ఇలా...

Viral Video: ఏదో ప్రళయం వచ్చే ముందే ఈ చేపలు కనిపిస్తాయట.. తీరానికి కొట్టుకొచ్చిన డూమ్స్​ డే ఫిష్‌
Doom Day Fish
K Sammaiah
|

Updated on: Jun 05, 2025 | 1:53 PM

Share

ఈ వారంలో రెండు వేర్వేరు అత్యంత అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. “డూమ్స్ డే ఫిష్” అని పిలుచుకునే డీప్-సీ ఓర్ ఫిష్ తీరానికి కొట్టుకు వచ్చాయి. ఒకటి మన దేశంలోని తమిళనాడు తీరంలో మత్స్యకారులకు చిక్కితే మరొకటి ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకు వచ్చింది. మహా సముద్ర గర్భంలో నివసించే ఈ చేపలు ఇలా ఓడ్డుకు కొట్టుకురావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. సూర్యకాంతి చేరని ప్రదేశంలో జీవించే ఈ జీవులు సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. ఈ చేప కనిపించడం ప్రకృతి వైపరీత్యాలకు దారి తీస్తుందని జపనీయులు నమ్ముతున్నారు.

గతంలో వచ్చిన సునామీకి కొద్ది నెలల ముందు ఇవి కనిపించాయని చెప్తున్నారు. ఫసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ లోతు దాదాపు 10984 మీటర్లు. అంటే దాదాపు 11 కిలోమీటర్లు. ఎవరెస్ట్ శిఖరాన్ని అడుగు భాగం నుంచి పెకిలించి ఇక్కడ వేస్తే అది 2 కిలోమీటర్ల సముద్ర జలాల లోతున మునిగిపోతుంది. సూర్య కిరణాలు సముద్రంలోకి 1000 మీటర్ల లోతులోకి మాత్రమే ప్రసరించగలవు. వాస్తవానికి 200 మీటర్ల లోతు నుంచి వెలుగు క్షీణిస్తుంది. అయితే, ‘బ్లాక్ సీ డెవిల్ యాంగ్లర్ ఫిష్’, ‘డూమ్స్‌డే’ లాంటి అనేక రకాల చేపలు మహా సముద్రాల లోతులో జీవిస్తుంటాయి. ఇవి సముద్ర ఉపరితలంపైకి రావడం అత్యంత అరుదైన విషయం. ఈ చేప తాజాగా సముద్ర ఉపరితలంపై కనిపించడంపై పలు ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి.

రిబ్బన్ ఆకారంలో పొడవైన శరీరం, మెరిసే పొలుసులు కలిగిన ‘డూమ్స్‌డే ఫిష్’ లోతైన సముద్ర జీవి తాజాగా ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకుని వచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది. భూకంపాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల రాకకు ఇవి సంకేతమని జపనీయులు విశ్వసిస్తుంటారు. ‘డూమ్స్‌డే’ చేప ఉపరితలంపైకి వస్తే సునామీ వంటి విపత్తు రాబోతుందని జపనీయుల నమ్మకం. 2017ఆగస్టులో ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ ద్వీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడానికి కేవలం ఒక రోజు ముందు ‘డూమ్స్‌డే’ ఓర్ ఫిష్‌లు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి.

వీడియో చూడండి: