VIRAL VIDEO : వృద్ధులు తెలివిగలవారని అందరు నమ్ముతారు. మంచి, చెడు విషయాలను అర్థం చేసుకొని తమ అనుభవాల ద్వారా ఇతరులకు సలహాలు, సూచనలు అందిస్తారు. చిన్నపిల్లలకు మంచి బుద్ధులు నేర్పిస్తారు. దీంతో వృద్ధులను అందరు గౌరవిస్తారు. అయితే ఇక్కడ ఇద్దరు వృద్ధులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే ఎవ్వరైనా నవ్వు ఆపుకోలేరు. వృద్ధులు ఇలా కూడా ఉంటారా అని అందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
వీడియోలో ఏముంది?
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వృద్ధులు క్యారమ్ ఆడుతున్నట్లు చూపించారు. నల్ల చొక్కా వేసుకున్న వృద్ధుడు బల్లపై కూర్చుంటాడు. తెల్లచొక్కా వేసుకున్న వృద్ధుడు కింద కూర్చొని ఉంటాడు. ఇద్దరు కలిసి క్యారమ్ ఆడుతుంటారు. అయితే అకస్మాత్తుగా తెల్లచొక్కా వేసుకున్న వృద్ధుడు మరో వృద్ధుడిని క్యారమ్ ఆడకుండా అడ్డుకుంటాడు. అంతేకాకుండా క్యారమ్ బోర్డులోని కైన్స్‌ను చెల్లాచెదరు చేస్తాడు. దీంతో నల్ల చొక్కా వేసుకున్న వృద్ధుడికి విపరీతమైన కోపం వస్తుంది. దీంతో ఒక్కసారిగా లేచి కింద కూర్చున్న వృద్ధుడిని కొట్టడం ప్రారంభిస్తాడు. ఈ సన్నివేశం తెగ నవ్వు తెప్పిస్తుంది. సోషల్‌మీడియాలో నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. దీనిని చాలామంది లైక్ చేస్తున్నారు. ఇంకా ఇతర గ్రూప్‌లలో షేర్ చేస్తూ నవ్విస్తున్నారు.
दिल तो बच्चा है. ??
बचपन सदैव जीवित रहना चाहिए.@rupin1992 @ipskabra pic.twitter.com/mpnz2CiCsj
— Shri K. Sharma. (@shrikrishanmtr) May 29, 2021