లక్షల డబ్బు పోసి కొన్న లగ్జరీ కారు రోజుల వ్యవధిలోనే మొరాయించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కారు యజమాని గాడిదలతో వీధుల్లో ఊరేగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలింతకీ ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కు సుందర్‌వాస్ ప్రాంతానికి చెందిన మద్దిలోని రామ్‌జీ హ్యుందాయ్ షోరూమ్ నుంచి రెండు నెలల క్రితం శంకర్‌లాల్ అనే వ్యక్తి రూ.18 లక్షలతో హ్యుందాయ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే కారులో సాంకేతిక సమస్య తలెత్తి.. కారు ఆగిపోయింది. దీనిపై శంకర్‌లాల్ సర్వీస్ సెంటర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. బ్యాటరీ రన్ డౌన్ కారణంగా సమస్య తలెత్తిందని, కొద్ది సేపటికే మళ్లీ కారు స్టార్ట్ అవుతుందని సూచించారు. అయినా పలుమార్లు కారు ఆగిపోతుండటంతో షోరూం డీలర్‌ను సంప్రదించి తనగోడు విన్నవించాడు. వారు కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.
Never mess with #indians#Udaipur: 18 lakh car broke down, the owner dragged it with donkeys and sent it back to the showroom,
Angry car owner called the showroom but they didn’t help. So, he used donkeys to pull his car. Watch why he did that.#hyundai #donkeypullcar #creta pic.twitter.com/OZMsMoFXyd
— Siraj Noorani (@sirajnoorani) April 26, 2023
దీంతోకారును తిరిగి షోరూంకు అప్పగించి, తన సొమ్మును తనకివ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా సేల్స్ తర్వాత కస్టమర్‌లను పట్టించుకోని సదరు కంపెనీ తీరును అందరికీ చెప్పేందుకు వినూత్నంగా ప్రచారం చేశాడు. వెంటనే రెండు గాడిదలను తీసుకుని కారుకు కట్టి దాన్ని రోడ్డుపై ఊరేగిస్తూ, భాజాభజంత్రీలతో షోరూంకు తీసుకెళ్లాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇండియన్స్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది’, ‘నిర్లక్ష్యంగా వ్యవహరించే షోరూంలకు ఇది మంచి గుణపాఠం’, ‘హ్యుందయ్ వరస్ట్ కంపెనీ.. నేను కూడా ఓ కారు కొని చాలా ఇబ్బందిపడ్డాను’ అని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.