AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్ నడుపుతుండగా హెడ్‌లైట్ నుంచి వింత శబ్ధాలు.. ఆపి చూడగా ప్యాంట్ తడిచిపోయింది..

'వై షుడ్ ఓన్లీ మనుషులు హావ్ ఫన్'.. ఈ డైలాగ్ కాస్త మార్చాం లెండి. మనుషులే కాదు.. మాక్కూడా ఫన్ ఉండాలనుకుంది ఓ భారీ పాము. సరిగ్గా కొత్త బైక్..

Ravi Kiran
|

Updated on: Apr 27, 2023 | 12:09 PM

Share

‘వై షుడ్ ఓన్లీ మనుషులు హావ్ ఫన్‘.. ఈ డైలాగ్ కాస్త మార్చాం లెండి. మనుషులే కాదు.. మాక్కూడా ఫన్ ఉండాలనుకుంది ఓ భారీ పాము. సరిగ్గా కొత్త బైక్ హెడ్‌లైట్ బాక్స్‌లో దూరి దాక్కుంది. ఇక బైక్ నడిపే యజమాని అది చూసి దెబ్బకు దడుసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మయూర్‌భంజ్ జిల్లా ఒరచందబిల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి కొత్త బైక్ కొనుగోలు చేశాడు. ఉత్సాహంగా దానిపై తన ఇంటికి రయ్.. రయ్ మంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో అతడికి దడపుట్టించేలా వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ముందుగా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే అవి అంతకంతకూ పెరుగుతూపోతుండటంతో.. ఎక్కడ నుంచి వస్తున్నాయో గమనించాడు. బైక్ హెడ్‌లైట్ బాక్స్ నుంచి ఏదో కదులుతున్నట్లు కనిపించింది. బైక్ ఆపి చూడగా.. అది ఏకంగా నాలుగు అడుగుల పాము.. అంతే! దెబ్బకు అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. వెంటనే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్‌కు చెప్పాడు. అతడు ఆ భారీ త్రాచుపామును రెండు గంటలు శ్రమించి పట్టి బంధించాడు. చివరికి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..