AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Vedeo: ఐదున్నర దశాబ్ధాలుగా వీటిది విడదీయరాని స్నహబంధం… ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సుప్రియా సాహు పోస్ట్ వైరల్

స్నేహం మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా ఉంటుందా? ఒకటి కాదు రెండు కాదు 55 ఏళ్లుగా అవి దోస్త్‌లుగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. స్నేహమేరా జీవితం భామ, కామాక్షి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం దగ్గర నుంచి...

Viral Vedeo: ఐదున్నర దశాబ్ధాలుగా వీటిది విడదీయరాని స్నహబంధం... ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సుప్రియా సాహు పోస్ట్ వైరల్
Elephants Friendship For 55
K Sammaiah
|

Updated on: Aug 07, 2025 | 7:35 PM

Share

స్నేహం మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా ఉంటుందా? ఒకటి కాదు రెండు కాదు 55 ఏళ్లుగా అవి దోస్త్‌లుగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి. స్నేహమేరా జీవితం భామ, కామాక్షి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ కలిసే చేస్తాయి. ఊసులు చెప్పుకుంటూ చెరకుగడలు తినడం వీటికి నచ్చిన పని. అందుకే 30 ఏనుగులు ఉన్న తెప్పకాడు శిబిరంలో భామ, కామాక్షిలు ప్రత్యేకమని ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సుప్రియా సాహూ చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఏనుగుల స్నేహం గురించి తెలుసుకున్న యానిమల్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏనుగుల సగటు జీవితకాలం 70 సంవత్సరాలు. కొన్ని వందేళ్ల వరకు జీవిస్తాయి. ఇప్పుడు భామకు 75 , కామాక్షికి 65 అంటే సగానికి పైగా జీవితకాలంలో మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. ఏనుగులు హృదయాలను ద్రవింపజేసే స్నేహ బంధాన్ని పంచుకుంటాయని ఎవరూ అనుకోరని సుప్రియా సాహు రాసుకొచ్చారు.

వీడియో చూడండి:

ఒకసారి భామను అడవిలోకి మేతకు తీసుకెళ్లిన మావటిపై చిరుతపులి దాడి చేసిందట. భామ ఆ చిరుతపులిని తరిమికొట్టి మావటి ప్రాణాన్ని కాపాడిందట. అలాగే కామాక్షిపై ఒకసారి ఓ మగ ఏనుగు దాడి చేసిందట. దాని గాయాలు నయమవ్వడానికి సంవత్సరాలు పట్టింది కానీ అది ధైర్యంగానే ఉందనీ సుప్రియా సాహు రాసుకొచ్చారు. క్యాంప్‌ మీల్ టైమ్‌లో కూడా భామ, కామాక్షి కలిసే ఉంటాయి. వాటికి చెరకు చాలా ఇష్టం, ఒక దానికి మాత్రమే చెరకు ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఎప్పుడూ రెండిటికీ కలిపి ఇస్తారని సుప్రియ తెలిపారు. వీటి సంరక్షణ బాధ్యత వహిస్తున్న క్యాంపు అధికారుల కృషిని కూడా ఆమె ప్రశంసించారు.

భామ, కామాక్షితో పాటు క్యాంప్‌లో మరో 27 ఏనుగులు ఉన్నాయి. వాటిని తమిళనాడు అటవీ శాఖ సంరక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో ఇంతకాలం అవి ఫ్రెండ్స్‌గా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భామ, కామాక్షిల స్నేహం గురించి రెండు వీడియోలను షేర్ చేయడంతో అవి చాలా మందిని ఆకట్టుకున్నాయి.