యుద్ధం ఎవరికైనా విషాదాన్ని మిగులుస్తుంది.. గెలిచిన వారికైనా.. ఓడిన వారికైనా యుద్ధం తీరని వ్యధను, మానని గాయాలను అందిస్తుంది.. ఇది చరిత్ర చెప్పిన నిజం.. గత ఏడాది నుంచి రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ వ్యక్తి.. యుద్ధానికి వ్యతిరేకంగా తన నిరసన తెలిపేందుకు సరికొత్త పంథా ఎంచుకున్నాడు. రష్యా పార్క్‌లో ప్రజలను కౌగిలించుకుంటూ శాంతి మంత్రం పఠిస్తున్నాడు ఆ వ్యక్తి . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆ వ్యక్తి మనసు నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది. అతని ధైర్యానికి ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఉక్రెయిన్‌పై తన దేశం రష్యా చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఒక రష్యన్ వ్యక్తి చేపట్టిన ప్రత్యేక నిరసన ఆన్‌లైన్‌లో దృష్టిని ఆకర్షిస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచిస్తే… వారు తనను కౌగిలించుకోవాలని ప్లకార్డు పట్టుకున్నాడు ఆ వ్యక్తి.. ప్రస్తుతం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ABC న్యూస్ షేర్ చేసింది.
పార్క్ దగ్గర ఉన్న వ్యక్తిని చిన్న, పెద్ద అనే బేధం లేకుండా ముందుకు వచ్చి కౌగిలించుకుంటున్నట్లు క్లిప్ చూపిస్తుంది. పిల్లలు, మహిళలు, పురుషులు అతనిని కౌగిలించుకుంటూ.. తాము కూడా యుద్ధానికి వ్యతిరేకం అని నోటితో చెప్పకుండా తమ భావాలను వ్యక్తం చేశారు.
20 ఏళ్ల యువకుడి గురించి ప్రస్తావిస్తూ.. తాను భయంతో జీవించి జీవించి విసిగిపోయానని .. అందుకనే తాను ఈ కార్యక్రమం చేపట్టినల్టు తెలిపారు. యువకుడు కోరిక అనేకమందిని ఆకట్టుకుంది. నీ దైర్యం మా సలాం అంటున్నారు. నువ్వు క్షేమంగా ఉండాలని కోరుతున్నారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఈ యువకుడు “ఎంత ధైర్యవంతుడు! ఇలా యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడినందుకు నీకు థాంక్స్ .. నువ్వు చంపబడవని తాను ఆశిస్తున్నానని కామెంట్ చేశాడు. మరొకరు “వావ్! చాలా అద్భుతంగా ఉంది.. ఈ ఘటనను షూట్ చేయడానికి అక్కడ ఎవరో ఉన్నారు అని వ్యాఖ్యానించగా.. చాలా ధైర్యమైనది. అతను నడిచే చోట శాంతి అతనితో ఉంటుందని చెప్పాడు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడాది పూర్తి అయింది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత వారం తూర్పు ఉక్రెయిన్ డాన్‌బాస్ ప్రాంతంలోని ఆక్రమిత భూభాగాలను ఆకస్మికంగా సందర్శించారు. అదే వారంలో రష్యా దాడుల్లో ఇద్దరు ఉక్రేనియన్లు మరణించారు. 10 మంది గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..