Viral Video: రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాలి. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. రోడ్డు పక్కన నడిచేవారిపై వాహనాలు ఎక్కించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి వార్తలు ప్రతిరోజు చూస్తునే ఉంటాం. భారతదేశంలో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని గత ఏడాది సర్వేలో తేలింది. దీన్ని బట్టి చూస్తే ఏడాదిలో ఎన్ని మరణాలు సంభవించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపై ఘోర ప్రమాదం జరుగుతుంది. వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఒక కారు వారి వైపునకు వస్తుంది. ఇంతలో వారిని చూసి కారు స్లో అవుతుంది. అంతే వేగంగా ఒక బైక్ వచ్చి కారును బలంగా ఢీకొడుతుంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తులు దూరంగా ఎగిరిపడుతారు.
బైక్ చిత్తు చిత్తు అయిపోతుంది. ఇలాంటి ప్రమాదాన్ని మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. తరువాత రోడ్డుపై నడిచే వ్యక్తులు బాధితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వీడియోలో బైక్ రైడర్లు ఎంత స్పీడ్‌గా వచ్చారో చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ 18 సెకన్ల వీడియోని ఇప్పటివరకు 6 వేల మందికి పైగా చూశారు. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో చాలామంది వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
— Vicious Videos (@ViciousVideos) March 16, 2022