ఆలయంలో నాట్యం చేస్తున్న చిన్నారిని ఆ ఆలయ ఏనుగు ఆశీర్వదించిన వీడియో వేలాది మంది హృదయాలను ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరుకుంది. వెంటనే ఆయన ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆనంద్ మహీంద్రా మరో అద్భుతమైన వీడియోను తమకు పరిచయం చేశారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ టెక్ దిగ్గజం ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రశంసించడం… ప్రోత్సహించడం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలిక ఆలయంలో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Sri Durgaaparameshwari temple , Kateel, Karnataka.
Amazing. And I would like to think the Temple Elephant is bestowing a blessing on all of us for a Happier New Year! ? pic.twitter.com/s2xdqV8w5D ఇవి కూడా చదవండి— anand mahindra (@anandmahindra) December 31, 2022
కర్ణాటక కత్తిల్ ఏరియాలోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఓ చిన్నారి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అక్కడే ఉన్న గజరాజు చిన్నారి డాన్స్‌ను చూసి ఫిదా అయిపోయింది. ఆ బాలికను తన తొండంతో ఆశీర్వదించడమే కాకుండా.. తను కూడా డాన్స్‌చే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఆ గజరాజు మనందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లు తాను భావిస్తున్నానని మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..